ఫిబ్రవరి 11 నుంచి OTTలోకి ‘మన శంకర వరప్రసాద్ గారు’
- February 03, 2026
ఈ ఏడాది సంక్రాంతికి థియేటర్లలో సందడి చేసిన సినిమా మన శంకర వర ప్రసాద్ గారు మెగాస్టార్ చిరంజీవి హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. మాస్, కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్ అన్నీ కలగలిపి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం సాధించింది. జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు రికార్డులను కొల్లగొడుతూ భారీ కలెక్షన్లు రాబట్టింది. ఇప్పటి వరకు ఈ సినిమా కలెక్షన్లు రూ.400 కోట్ల మార్క్ ను చేరినట్లు సమాచారం.
ఈ నెల 11 నుంచి జీ 5 లో స్ట్రీమింగ్
తెలుగు సినిమాల్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా ‘మన శంకరవప్రసాద్ గారు’ రికార్డుల కెక్కింది. సినిమా విడుదలై మూడు వారాలు గడుస్తున్నా కలెక్షన్లు మాత్రం తగ్గలేదని తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమాకు మొదటి షో నుంచే మంచి టాక్ వచ్చింది. సాహు గారపాటి, సుష్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో హీరోయిన్ గా నయనతార నటించింది.
అతిథి పాత్రలో విక్టరీ వెంకటేశ్ కూడా ఈ సినిమాలో కనిపించారు. థియేటర్లలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను జీ 5 సొంతం చేసుకుంది. ఈ నెల 11 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. థియేటర్లలో ఫుల్ లెంగ్త్ ఎంటర్టైన్‌మెంట్ అందించిన ఈ మూవీ ఓటీటీ ప్రేక్షకుల్ని ఏ మేరకు అలరిస్తుందో వేచి చూడాలి.
తాజా వార్తలు
- ‘వందేమాతరం’ వివాదం..డీకే శివకుమార్ ప్రభుత్వానికి గవర్నర్ హెచ్చరిక
- కల్బాలో అల్ ఫ్రైష్ సరస్సు ప్రాజెక్టుకు షార్జా రూలర్ ఆమోదం
- హైదరాబాద్‌లో భారీ వర్షం..కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
- 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాకు ఘన గౌరవం
- మారిషస్ రాష్ట్రపతి చేతుల మీదుగా డా.గజల్ శ్రీనివాస్ ‘శ్రీమద్భగవద్గీత’ ఆల్బమ్ ఆవిష్కరణ
- ఎట్టకేలకు ఏపీలో నంది అవార్డులు..
- షేక్ అహ్మద్‌కు అంతిమ ప్రార్థనలు.. హాజరైన షేక్ మహమ్మద్, పలువురు రాజకుటుంబ సభ్యులు
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి
- యూఏఈలో పిల్లలకు ఫ్లూ హెచ్చరికలు.. స్కూల్‌కు పంపొద్దని సూచన..!!
- కార్మికుల రిక్రూట్మెంట్ పై వార్న్..SR100,000 వరకు ఫైన్..!!







