ఉగాది, కళారత్న పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం
- February 05, 2026
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత, సంస్కృతి సమితి ఆధ్వర్యంలో మార్చి 19న నిర్వహించనున్న శ్రీ "పరాభవ" నామ సంవత్సర ఉగాది వేడుకల సందర్భంగా వివిధ రంగాల్లోని ప్రముఖులకు 'ఉగాది', 'కళారత్న' పురస్కారాలను ప్రధానం చేయడం జరుగుతుందని రాష్ట్ర సృజనాత్మకత, సంస్కృతి సమితి ముఖ్య కార్యనిర్వహణాధికారి ఆర్.మల్లిఖార్జునరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
1.సాహిత్యం 2.సంగీతం 3.నృత్యం 4.చిత్రలేఖనం 5. శిల్పం 6.నాటకం 7.జానపదం 8.మిమిక్రీ 9.అవధానం 10.వైద్యం 11.ఇంద్రజాలం & మూకాభినయం 12. హరికథ & బుర్రకథ 13. జర్నలిజం 14.సామాజిక సేవ, 15.కమిటీ సిఫార్సు చేసిన ఇతర సేవారంగాలు వంటి 15 విభాగాల్లో నిష్ణాతులైన వారు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు అన్నారు.గతంలో కేంద్ర ప్రభుత్వ అవార్డులు లేదా రాష్ట్ర స్థాయి ఉగాది/కళారత్న పురస్కారాలు పొందిన వారి ధరఖాస్తులు పరిశీలించరన్నారు. ఆసక్తి కల్గినవారు తమ బయోడేటాను ఫిబ్రవరి 20, 2026 లోపు ముఖ్య కార్యనిర్వహణాధికారి, రాష్ట్ర సృజనాత్మకత, సంస్కృతి సమితి, రెండవ అంతస్ధు ఘంటశాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాల, దుర్గాపురం, విజయవాడ కార్యాలయానికి పంపించవచ్చునని లేదా [email protected] ఈమెయిల్ ద్వారా గానీ దరఖాస్తు చేసుకోవచ్చునని ఆ ప్రకటనలో ఆర్.మల్లిఖార్జునరావు తెలియజేశారు.
తాజా వార్తలు
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?
- సౌదీ అరేబియాలో వడ్డీ రేట్లు పెంపు..!!
- హోర్ముజ్ జలసంధి పరిస్థితిపై ఒమన్ కీలక ప్రకటన..!!
- కువైట్‌లో డ్రోన్లపై మరోసారి హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్‌లో ఆలీ వాక్‌వేకు కొత్త రూపు..!!
- ఖతార్‌లో కీలక వడ్డీ రేట్లు పెంపు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !







