దివంగత ఫాదర్ అమీర్ మృతికి పలువురు ప్రముఖులు సంతాపం..!!
- July 15, 2026
దోహా: ఖతార్ దివంగత ఫాదర్ అమీర్ షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్-థానీ మృతి పట్ల అమీర్ హెచ్.హెచ్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీని పలువురు పరామర్శించి, తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
దోహాలోని లుసైల్ ప్యాలెస్‌లో అమీర్ ను పలు దేశాలకు చెందిన ప్రముఖులు కలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు షేక్‌లు, మంత్రులు, ప్రముఖులు, వివిధ దేశాల దౌత్యవేత్తలు, పౌరులు ప్యాలెస్‌కు చేరుకుని దివంగత నేతకు ఘన నివాళులర్పించారు.
అరబ్ దేశాలతో పాటు పలు మిత్రదేశాల ప్రతినిధులు కూడా విచ్చేసి అమీర్‌ను పరామర్శించారు. పలు దేశాధినేతలు టెలిఫోన్ ద్వారా అమీర్ ను పరామర్శించారు. దివంగత ఫాదర్ అమీర్ ఆత్మకు శాంతి చేకూరాలని వారు ప్రార్థించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







