భారతీయ ఉపాధ్యాయురాలిని అత్యుత్తమ పురస్కారంతో సత్కరించిన దుబాయ్ క్రౌన్ ప్రిన్స్..
- February 05, 2026
దుబాయ్: అంతర్జాతీయంగా ఖ్యాతి గడించిన భారతీయ విద్యావేత్త, కళాకారిణి మరియు సామాజిక నూతనతావాది రౌబుల్ నాగీకి ప్రతిష్ఠాత్మకమైన యూఎస్ డాలర్లు 10 లక్షల (US $1 మిలియన్) విలువైన జెమ్స్ ఎడ్యుకేషన్ గ్లోబల్ టీచర్ ప్రైజ్ లభించింది.
దుబాయ్‌లో నిర్వహించిన వరల్డ్ గవర్నమెంట్ సమిట్ వేదికపై దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఈ అవార్డును అందజేశారు.
ఈ ఏడాది 139 దేశాల నుంచి వచ్చిన 5,000కుపైగా నామినేషన్లు మరియు దరఖాస్తులలో నుంచి రౌబుల్ నాగీని విజేతగా ఎంపిక చేశారు. సమిట్ చివరి రోజున ఈ ప్రకటన చేయగా, జెమ్స్ ఎడ్యుకేషన్ వ్యవస్థాపకుడు సన్నీ వర్కీ మరియు వర్కీ ఫౌండేషన్ ప్రతినిధుల సమక్షంలో అవార్డును అందజేశారు.
ఇరవై ఆరు సంవత్సరాల క్రితం, తన ఆర్ట్ వర్క్‌షాప్‌లలో ఒకదానిలో ఇండియన్ టీచర్ రూబుల్ నాగి తన జీవితాన్ని పూర్తిగా మార్చిన ఒక చిన్నారిను కలిశారు. “అతను ఇంతకు ముందు ఎప్పుడూ పెన్సిల్‌ను కూడా చూడలేదు,” అని ఆమె ప్రపంచ ప్రభుత్వ సమ్మిట్ 2026 సందర్భంగా గుర్తుచేసుకున్నారు.
సామాజికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన పిల్లలకు విద్య, సృజనాత్మకత మరియు ఆత్మవిశ్వాసం అందించేందుకు ఆమె చేసిన కృషి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. వేలాది మంది అభ్యర్థులలోంచి ఎంపికైన రూబుల్ నాగి, కళను సాధనంగా ఉపయోగించి పిల్లల జీవితాల్లో మార్పు తీసుకురావాలనే తన సంకల్పాన్ని మరింత బలపరిచారు.
ఈ అవార్డు ఆమె చేసిన సేవలకు మాత్రమే కాకుండా, విద్య ద్వారా సమాజాన్ని మారుస్తామనే నమ్మకానికి కూడా గౌరవంగా నిలిచింది.
తాజా వార్తలు
- ఫిలిప్పీన్స్‌లోని బొంగావోలో అర్ధరాత్రి మంటలు: 1,000 కి పైగా ఇళ్లు దగ్ధం
- భారతీయ ఉపాధ్యాయురాలిని అత్యుత్తమ పురస్కారంతో సత్కరించిన దుబాయ్ క్రౌన్ ప్రిన్స్..
- DPDP గడువు కుదింపుతో భారత స్టార్టప్ పర్యావరణ వ్యవస్థకు సవాళ్లు
- ఇది సభ సంప్రదాయం కాదు: స్పీకర్ ఓం బిర్లా
- ఐఐటీ హైదరాబాద్‌లో ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు
- అక్రమ మద్యం రహిత రాష్ట్రంగా ఘనత సాధించిన ఏపీ: మంత్రి రవీంద్ర
- జర్నలిస్టుల కుటుంబాలకు అండగా మీడియా అకాడమీ..రూ.లక్ష ఆర్థిక సహాయం
- బొగ్గు గనిలో పేలుడు 10 మంది మృతి మేఘాలయలో విషాదం!
- సైబర్ మోసాలకు చెక్.. వింగో యాప్ క్లోజ్!
- స్కూల్ అడ్మిషన్స్..కొత్త కట్ ఆఫ్ తేదీ పై పేరెంట్స్ ఆందోళన..!!







