Dh50,000 విలువైన బంగారాన్ని విసిరివేసిన దుబాయ్ నివాసి..!!

- February 06, 2026 , by Maagulf
Dh50,000 విలువైన బంగారాన్ని విసిరివేసిన దుబాయ్ నివాసి..!!

యూఏఈ: అనుకోకుండా Dh50,000 విలువైన బంగారాన్ని విసిరివేసిన ఘటన దుబాయ్ లో చోటుచేసుకుంది. అయితే, అనుహ్యంగా వారి సేఫ్ గా వారి వద్దకు చేరడంతో వారు ఊపిరిపీల్చుకున్నారు. ఇక వివరాల్లోకి వెళితే.. 2021లో ఇండియాకు వెళ్లడానికి ముందు 23 సంవత్సరాలు యూఏఈలో నివసించిన మాజీ దుబాయ్ నివాసి కామిని కన్నన్ ఇటీవల పెళ్లి పనుల కోసం తిరిగి దుబాయ్ వచ్చారు. జనవరి చివరిలో బంగారం ధరలు గ్రాముకు Dh600 కంటే ఎక్కువగా పెరిగిన నేపథ్యంలో ఆమె దశాబ్దాలుగా బంగారంలో ఎంత పెట్టుబడి పెట్టిందో తిరిగి అంచనా వేయాలని నిర్ణయించుకున్నారు.  
ఆమె బంగారాన్ని సేఫ్ చేయడానికి ఉపయోగించిన అరిగిపోయిన పర్సు పాతడి కావడంతో.. అందులోని ఒక్కొక్కటి 8 గ్రాములున్న నాలుగు 22K బంగారు నాణేలు, ఒక 50g 24K బంగారు బార్ వేరే పర్సులోకి మార్చారు. అయితే, పొరపాటున దానిని డైనింగ్ టేబుల్ వద్ద పెట్టడంతో అనుకోకుండా అది చేత్తలోకి చేరింది.ఇక బంగారం దొరకదని వారు అనుకున్నారు. కానీ అనుకోని రీతిలో వారి బంగారం వారి వద్దకే వచ్చి చేరంది. ఇది అద్భుతం అని ఆ ఫ్యామిలీ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  
సరిగ్గా మూడు రోజుల తర్వాత, ఫిబ్రవరి 4న తన కుమారుడికి సెక్యూరిటీ గార్డు నుండి  ఫోన్ కాల్ వచ్చింది. దుబాయ్ పోలీసులు బంగారం ఓనర్ కోసం వెతుకుతున్నారని తెలుసుకొని ఆశ్చర్యపోయారు. చెత్తను సేకరించే వ్యక్తి ఆ బంగారాన్ని గుర్తించి పోలీసులకు అందజేయడంతో, ఆ చెత్త వచ్చిన అడ్రస్ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. అన్ని వివరాలను సరిచూసుకొని బంగారాన్ని వారికి అందజేశారు. దుబాయ్ నివాసితులు మరియు పర్యాటకులు కోల్పోయిన వస్తువులను తిరిగి ఇప్పించడంలో దుబాయ్ పోలీసులకు మెరుగైన ట్రాక్ రికార్డ్‌ ఉంది. గత సంవత్సరం, పోలీసులు DXB టెర్మినల్ 1 వద్ద Dh102,000 నగదుతో నిండిన బ్యాగ్‌ను కేవలం 30 నిమిషాల్లో గుర్తించి బాధితులకు అందజేశారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com