విద్యార్థులకు ప్రధాని మోదీ సందేశం
- February 06, 2026
న్యూ ఢిల్లీ: భారత దేశవ్యాప్తంగా బోర్డు పరీక్షలకు సిద్ధమవుతున్న కోట్లాది మంది విద్యార్థులకు ప్రధాని నరేంద్ర మోదీ ఆత్మవిశ్వాసాన్ని నింపుతున్నారు. ప్రతి ఏడాది నిర్వహిస్తున్నట్లే ఈసారి కూడా ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమం 9వ ఎడిషన్ ద్వారా విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో ఆయన ప్రత్యక్షంగా సంభాషిస్తున్నారు.
ప్రధాని తన అధికారిక నివాసంలో దేశంలోని దేవ్‌మోగ్రా, కోయంబత్తూర్, రాయ్‌పూర్, గౌహతి, ఢిల్లీ వంటి ప్రాంతాల నుంచి ఎంపికైన ‘ఎగ్జామ్ వారియర్స్’తో ప్రత్యేకంగా మాట్లాడారు. పరీక్షలపై వారి సందేహాలు, భయాలు, అంచనాలను వినిపిస్తూ, తన అనుభవాలతో కూడిన సూచనలు అందించారు. జాతీయ విద్యా విధానం ప్రేరణతో కొనసాగుతున్న ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం – పరీక్షలను ఒత్తిడిగా కాకుండా ఒక సానుకూల అనుభవంగా(ParikshaPeCharcha) మార్చడం. విద్యార్థులు భయానికి లోనుకాకుండా, నమ్మకంతో పరీక్షలను ఎదుర్కోవాలని ప్రధాని సూచించారు.
సమయ నిర్వహణ, ఏకాగ్రత పెంపు, మొబైల్ ఫోన్‌లు మరియు ఇతర డిజిటల్ డిస్ట్రాక్షన్స్ నుంచి ఎలా దూరంగా ఉండాలన్న విషయాలను ప్రధాని తనదైన సరళ శైలిలో వివరించారు. పరీక్షల సమయంలో మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు ఉపయోగపడే ఆచరణాత్మక సూచనలను కూడా అందించారు.
ఈ కార్యక్రమం కేవలం విద్యార్థులకే కాకుండా, తల్లిదండ్రులకు కూడా దిశానిర్దేశం చేస్తుంది. పిల్లలపై అనవసర ఒత్తిడి పెట్టకుండా, వారి సామర్థ్యాన్ని అర్థం చేసుకుని మద్దతుగా నిలవాలని ప్రధాని హితవు పలికారు. దేశవ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పరీక్షల ముందు కీలక మార్గనిర్దేశం అందించే ఈ కార్యక్రమానికి విద్యార్థులు పెద్ద సంఖ్యలో స్పందిస్తున్నారు.
తాజా వార్తలు
- అల్మాటీలో 2029 ఆసియా వింటర్ గేమ్స్..!!
- కింగ్ సల్మాన్ రాయల్ రిజర్వ్ లోకి యానిమల్స్ రిలీజ్..!!
- దుబాయ్లో మరిన్ని చోట్ల పెయిడ్ పార్కింగ్..!!
- హవల్లిలో తనిఖీలు.. 65 నోటీసులు జారీ..!!
- పర్యాటకుల కోసం వ్యాట్ రీఫండ్.. ఒమన్ ప్లాన్..!!
- నకిలీ బంగారం విక్రయం.. అనుమానితుడు అరెస్ట్..!!
- జీతం చాలడం లేదు: 98% మంది యూఏఈ ఉద్యోగులు కంపెనీ మారడానికి రెడీ
- తిరుమల: తెరచుకున్న బంగారు డాలర్ల అమ్మకాల కౌంటర్
- ఫ్రాడ్ జరిగితే డబ్బులు వెనక్కి! RBI కొత్త పాలసీ ఇదే!
- విద్యార్థులకు ప్రధాని మోదీ సందేశం









