తిరుమల: తెరచుకున్న బంగారు డాలర్ల అమ్మకాల కౌంటర్

- February 06, 2026 , by Maagulf
తిరుమల: తెరచుకున్న బంగారు డాలర్ల అమ్మకాల కౌంటర్

తిరుమల: తిరుమలలో భక్తుల సౌలభ్యం కోసం నిర్వహిస్తున్న బంగారు, వెండి డాలర్ల విక్రయాల కౌంటర్ ఎట్టకేలకు తెరచుకుంది. ఇక్కడ మార్కెట్లో వాటి ధరలకు అనుగుణంగా భక్తులకు అవసరమైన డాలర్లు అమ్మకాలు చేస్తారు.ఈ మేరకు ధరల్లో తేడాతో కొద్దిరోజులు ఈ కౌంటర్ను టిటిడి మూసివేంది. చివరకు గురువారం ఉదయం నుండి కౌంటర్ను తెరచి భక్తులకు దేవుని ప్రతిమతో విక్రయించే డాలర్లు అందుబాటులో ఉంచింది. ఈనెల 10వతేదీ వరకు ఒకే ధరపై పలు రకాల డాలర్లు అమ్మకాలు భక్తులకు అందుకునే వెసలుబాటు కలిగింది.

2 గ్రాముల బంగారు డాలర్ ధర 30,828 రూపాయలుగా, 5గ్రాముల బంగారు డాలర్ 74,799 రూపాయలు, 10గ్రాముల బంగారుడాలర్ ధర 1,47,852 రూపాయలుగా నిర్ణయించి అమ్మకాలు చేస్తున్నారు. అలాగే 5గ్రాముల వెండి డాలర్ను 1,648 రూపాయలకు, 10గ్రాముల డాలర్ 3,132 రూపాయలు, 50గ్రాముల వెండి డాలర్ను 15,002 రూపాయలకు విక్రయిస్తున్నారు. ఈనెల 10వతేదీ వరకు ఇదే దరలు నిర్ణయించబడింది. శ్రీవారి భక్తులు ఎంతో పవిత్రంగా, భక్తితో కొనుగోలుచేసి ధరించడం సాంప్రదాయం. భక్తులు 50వేల రూపాయలు పైగా విలువైన డాలర్లు కొనుగోలు చేస్తే పాన్కార్డును తప్పనిసరిగా (జిరాక్స్ కాఫీ) సమర్పించాల్సి ఉంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com