దుబాయ్‌లో మరిన్ని చోట్ల పెయిడ్ పార్కింగ్..!!
- February 06, 2026
యూఏఈ: దుబాయ్‌లోని డిస్కవరీ గార్డెన్స్‌లో ఇటీవల ఆన్-స్ట్రీట్ పార్కింగ్‌ను అమలు చేసిన తర్వాత, ఇప్పుడు పామ్ జుమేరా క్రెసెంట్‌లో పెయిడ్ పార్కింగ్‌ను ప్రారంభించినట్లు పార్కోనిక్ ప్రకటించింది. ఈ కొత్త పార్కింగ్ వ్యవస్థ ఫిబ్రవరి 1 నుండి అమల్లోకి వచ్చిందని పేర్కొంది. పామ్ జుమేరా క్రెసెంట్‌లో ఆన్-స్ట్రీట్ పార్కింగ్‌కు గంటకు Dh10గా వసూలు చేస్తున్నారు. ఈ పార్కింగ్ రుసుములు వారానికి ఏడు రోజులు, రోజుకు 24 గంటలూ వర్తిస్తాయని, ఉచిత పార్కింగ్ సమయాలు లేవని పార్కోనిక్ తెలిపింది. ఈ ధరలు పీపుల్ ఆఫ్ డిటర్మినేషన్ (POD) కింద నమోదైన వాహనాలతో సహా అన్ని వాహనాలకు వర్తిస్తాయని వెల్లడించింది.
పామ్ జుమేరా క్రెసెంట్ జోన్ టిక్కెట్ లేని పెయిడ్ పార్కింగ్ ప్రాంతంగా పనిచేస్తుంది. వాహనాలను వాటి లైసెన్స్ ప్లేట్ నంబర్ ద్వారా గుర్తిస్తారు. ఇది డిజిటల్ పార్కింగ్ రికార్డుగా పనిచేస్తుంది. ఈ ప్రాంతంలో ఫిజికల్ టిక్కెట్లు, పార్కింగ్ మీటర్లు కనిపించవని తెలిపింది.
పార్కోనిక్ ప్రకారం, వాహనదారులు SMS ద్వారా పార్కింగ్ ఫీ చెల్లించి సెషన్‌ను ప్రారంభించవచ్చు. చెల్లింపులో విఫలమైతే, సాలిక్ నిబంధనలు మరియు షరతులకు లోబడి, వాహనం బయటకు వెళ్లిన తర్వాత పార్కింగ్ రుసుము వెహికల్ సాలిక్ అకౌంట్ నుండి ఆటోమెటిక్ గా డెబిల్ అవుతుంది. ఈ ప్రదేశంలో క్యాష్ పేమెంట్స్, పార్కింగ్ యంత్రాలు మరియు QR ఆధారిత పేమెంట్స్ లాంటివి అందుబాటులో ఉండవని టూరిస్టులు, విజిటర్స్ గమనించాలని కోరింది.
తాజా వార్తలు
- మసీదులో భారీ పేలుడు..పలువురు మృతి
- జగన్ పరామర్శ యాత్రలో ఇద్దరు మృతి
- BJP మేనిఫెస్టో విడుదల చేసిన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు
- జర్నలిస్టులకు శుభవార్త..9 నుంచి అక్రిడిటేషన్లకు దరఖాస్తు స్వీకరణ
- అల్మాటీలో 2029 ఆసియా వింటర్ గేమ్స్..!!
- కింగ్ సల్మాన్ రాయల్ రిజర్వ్ లోకి యానిమల్స్ రిలీజ్..!!
- దుబాయ్‌లో మరిన్ని చోట్ల పెయిడ్ పార్కింగ్..!!
- హవల్లిలో తనిఖీలు.. 65 నోటీసులు జారీ..!!
- పర్యాటకుల కోసం వ్యాట్ రీఫండ్.. ఒమన్ ప్లాన్..!!
- నకిలీ బంగారం విక్రయం.. అనుమానితుడు అరెస్ట్..!!









