మస్కట్ లో INSV కౌండిన్యకు ఘనంగా వీడ్కోలు..!!

- February 09, 2026 , by Maagulf
మస్కట్ లో INSV కౌండిన్యకు ఘనంగా వీడ్కోలు..!!

మస్కట్: భారత నావికాదళ సెయిలింగ్ నౌక (INSV) కౌండిన్యను మస్కట్ నుండి బయలుదేరింది. ఈ సందర్భంగా జెండా ఊపి ఘనంగా వీడ్కోలు పలికారు. ఇది ఉమ్మడి సముద్ర వారసత్వంతోపాటు ఇండియా- ఒమన్ దౌత్య భాగస్వామ్యానికి ప్రతీకగా నిలిచింది. 

ఈ కార్యక్రమంలో ఒమన్ రాయల్ నేవీకి చెందిన కమోడోర్ అబ్దుల్లా అల్ హజ్రీ, విదేశాంగ మంత్రిత్వ శాఖలో మానవ వనరుల విభాగాధిపతి యూసఫ్ బిన్ ఇస్సా అల్-జాడ్జాలి, ఒమన్‌లో భారత రాయబారి జి.వి. శ్రీనివాస్ మరియు భారత నావికాదళ సెయిలింగ్ అసోసియేషన్ చైర్మన్ కమెండర్ అమిత్ శ్రీవాస్తవతోపాటు పెద్ద సంఖ్యలో భారత ప్రవాసులు పాల్గొన్నారు.  

INSV కౌండిన్య పోర్బందర్ నుండి మస్కట్ వరకు తన చారిత్రాత్మక తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. ఈ ప్రయాణం రెండు దేశాలను చారిత్రాత్మకంగా సజీవ సముద్ర వారసత్వంతో తిరిగి కలుపిందని ఈ సందర్భంగా భారత,ఒమన్ అధికారులు పేర్కొన్నారు.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com