ఖతార్ లో వెయ్యి వస్తువుల ధరలు తగ్గింపు..!!

- February 09, 2026 , by Maagulf
ఖతార్ లో వెయ్యి వస్తువుల ధరలు తగ్గింపు..!!

దోహా: పవిత్ర రమదాన్ మాసం కోసం ప్రైస్ రెడక్షన్ స్కీమ్ ను ఖతార్ వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రకటించింది.  వెయ్యి కంటే ఎక్కువ వస్తువులపై ధరలను తగ్గించనున్నట్లు పేర్కొంది.    షుగర్, చికెన్, పాస్తా, ఆయిల్, మిల్క్ లాంటి ఫుడ్ ఐటమ్స్ తోపాటు నాన్ ఫుడ్ ఐటమ్స్ పైనా తగ్గింపు ఆఫర్ ఉందని మంత్రిత్వశాఖ తెలిపింది.

పవిత్ర రమదాన్ మాసంలో జీవన వ్యయాన్ని తగ్గించే ప్రయత్నాలలో భాగంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపింది.  ఈ తగ్గింపుల ప్రయోజనాన్ని పొందడానికి రిటైల్ అవుట్‌లెట్లలో "వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ ద్వారా తగ్గించబడిన ధరలు" అనే లేబుల్ కోసం చూడాలని మంత్రిత్వ శాఖ వినియోగదారులను కోరింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com