'గాయపడ్డ సింహం' కు ఆడియన్స్ ఫిదా అవుతారు: హీరో తరుణ్ భాస్కర్
- February 10, 2026
పవన్ సాదినేని ప్రజెంట్స్- తరుణ్ భాస్కర్, కశ్యప్ శ్రీనివాస్, సప్తస్వ మీడియా వర్క్స్, పిఓవి స్టోరీస్ & జీ స్టూడియోస్ 'గాయపడ్డ సింహం' ఫన్ ఫిల్డ్ ట్రైజర్ రిలీజ్, వేసవిలో థియేటర్లలో రిలీజ్
డిఫరెంట్ ఎంటర్టైనర్స్ తో అలరిస్తున్న తరుణ్ భాస్కర్, రైటర్- డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్‌తో కలిసి మరో యూనిక్ మూవీతో రావోతున్నారు. 'గాయపడ్డ సింహం' అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సప్తస్వ మీడియా వర్క్స్, పిఓవి స్టోరీస్, జీ స్టూడియోస్ బ్యానర్లపై కళ్యాణ చక్రవర్తి మంథిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సల్ నిర్మించారు. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ నటిస్తున్న 'ఆకాశంలో ఒక తార' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న పవన్ సాదినేని ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఆసక్తికరమైన టైటిల్ పోస్టర్‌తో బజ్‌ను సృష్టించిన ఈ టీం, ఇప్పుడు ఫన్ ఫిల్డ్ ట్రైజర్‌ను విడుదల చేశారు.
చిన్నప్పటి నుండి అమెరికాకు వెళ్లాలని కలలు కనే ఒక యువకుడి కథ ఇది. అతని కోరిక చివరికి నెరవేరుతుంది, ఎన్నో ఆశలతో అమెరికాకు వెళ్తాడు. కానీ అతని ఆనందం ఎక్కువ కాలం నిలవదు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అకస్మాత్తుగా అమెరికా చరిత్రలోనే అతిపెద్ద డిపోర్టేషన్ ఆపరేషన్‌ను ప్రకటిస్తాడు. ఈ కష్టాన్ని హీరో ఎలా ఎదుర్కొంటాడు, మనుగడ కోసం ఎలా పోరాడతాడు అనేది కథ ప్రధానాంశం.
కశ్యప్ శ్రీనివాస్ అందరికీ కనెక్ట్ అయ్యే అంశాన్ని అత్యంత వినోదాత్మకంగా తెరకెక్కించారు. ఈ ట్రైజర్ ఒక భారతీయ కోణం నుండి అమెరికన్ డ్రీమ్‌పై ఒక సెటైరికల్ నరేటివ్ ని ప్రజెంట్ చేస్తుంది. కేజీఎఫ్ తరహా ప్రెజెంటేషన్, పెళ్లిచూపులు తరహా కామెడీ కలగలిసి మరింతగా అలరించాయి.
తరుణ్ భాస్కర్ తన కామెడీ టైమింగ్ అలరించారు. ఈ పాత్రకు ఆయన పర్ఫెక్ట్ యాప్ట్. ఫరియా అబ్దుల్లా,శుభలేఖ సుధాకర్ కథను కేజీఎఫ్ తరహాలో వివరించ నవ్వులని పంచింది. మానస చౌదరి తరుణ్ లవర్ పాత్రలో నటిస్తుంది. విష్ణు ఓయ్ అతని స్నేహితుడిగా కనిపించారు.
విద్యా సాగర్ చింత సినిమాటోగ్రఫీ, స్వీకర్ అగస్తి సంగీతం సినిమా మూడ్‌ను అద్భుతంగా ఎలివేట్ చేశాయి. విప్లవ్ నైషధం ఎడిటర్, చంద్రిక గొర్రెపాటి ప్రొడక్షన్ డిజైనర్, కథను సూర్య ప్రకాష్ జ్యోసుల రాశారు.
2026 వేసవిలో సినిమా విడుదల అవుతుందని మేకర్స్ అనౌన్స్ చేశారు. సరదాగా సాగే ఈ ట్రైజర్ తో తో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి.
ట్రైజర్ లాంచ్ ఈవెంట్ లో హీరో తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ.. కొంతమందికి అమెరికా వెళ్లాలని లక్ష్యం ఉంటుంది. నా ఫ్రెండ్స్ లో కూడా చాలా మంది వున్నారు. కానీ వీసాలు చాలాసార్లు రిజెక్ట్ అవుతుంటాయి. దానికి చాలా నవ్వుకునే కారణాలు ఉంటాయి. నిజంగా అదొక ప్రపంచం. ఇలాంటి కథతో కశ్యప్ వచ్చినప్పుడు ఆ కథ చెప్పినప్పుడే విపరీతంగా ఎంజాయ్ చేశాను. ఆ యూనిక్ ట్రీట్మెంట్ కి ఫిదా అయిపోయాను. ఆడియన్స్ కూడా ఫిదా అవుతారని నమ్మకం ఉంది.కశ్యప్ చాలా యూనిక్ వాయిస్ ఉన్న డైరెక్టర్. తన సెన్సాఫ్ హ్యూమర్ చాలా యూనిట్ గా ఉంటుంది. తనకి ఒక సిగ్నేచర్ స్టైల్ ఉంది. స్క్రీన్ లో చూసినప్పుడు నవ్వుతూనే ఉంటారు. మా ప్రొడ్యూసర్స్ కి థాంక్యూ. పవన్ తను ఏదైనా అనుకుంటే కచ్చితంగా సాధిస్తాడు.తను సినిమాని ప్రజెంట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాచేయడం ఒక మంచి అవకాశం గా భావిస్తున్నాను. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. ధియేటర్లో లాఫ్ రైడ్ ఉంటుంది. ఈ సినిమాలో పనిచేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఫారియాతో నటించడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాలో ఒక డాన్స్ నెంబర్ ఉంది. అందులో నాకు చాలా హెల్ప్ చేసింది. చాలా మంచి సినిమా. ఎవరు మిస్ అవ్వకూడదని కోరుకుంటున్నాను.
హీరోయిన్ ఫారియా అబ్దుల్లా మాట్లాడుతూ.. సినిమాని ఒక ఆడియన్ గా విన్నాను. చాలా ఫన్నీగా ఉంటుంది. చాలా అద్భుతమైన కథ ఇది. డైరెక్టర్ చాలా చక్కగా తీశారు. నిర్మాతలకు, ప్రజెంటర్ పవన్ కి థాంక్యు. ఈ ప్రాసెస్ నేను చాలా ఎంజాయ్ చేశాను. తరుణ్ గారితో కలిసి నటించడం చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా ఈ సినిమా మీరందరూ ఎంజాయ్ చేస్తారు
డైరెక్టర్ కశ్యప్ మాట్లాడుతూ.. ఫస్ట్ సినిమా తీయడం, ఇక్కడి వరకు రావడం ఒక సక్సెస్. ఈ జర్నీలో నాకు సపోర్ట్ చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. డైరెక్టర్ పవన్ సాదినేని గారు ఈ సినిమాని ప్రజెంట్ చేస్తున్నారు. ఆయన సపోర్ట్ ని మర్చిపోలేను. ఈ కథ రెడీ చేసిన తర్వాత నా మైండ్ లోకి తరుణ్ భాస్కర్ గారు వచ్చారు. ఆయన ముందు చేయనన్నారు. కథ విని తర్వాత నిర్ణయం తీసుకోమన్నారు. కథ విన్న తర్వాత ఆయనకి చాలా నచ్చింది. వెంటనే ఓకే చెప్పారు. అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు
ప్రొడ్యూసర్ విజయ్ కృష్ణ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ఈ సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. స్నేహితులందరం కలసి చేశాం, మాతో జి స్టూడియోస్ కలవడం చాలా సంతోషంగా ఉంది. మా తరుణ్ భాస్కర్ తో వర్క్ చేయడం చాలా ఫన్. ఫారియా గారికి మానస గారికి అందరికీ థాంక్స్. అందరు కూడా ఈ సినిమాని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను
ప్రొడ్యూసర్ భాను కిరణ్ మాట్లాడుతూ.. చాలా మంచి సినిమా ఇది. ఎంటర్టైన్మెంట్ తో పాటు మంచి మెసేజ్ ఉన్న సిని.మా తప్పకుండా అందరూ కూడా ఈ సినిమాని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. డైరెక్టర్ చాలా అద్భుతంగా తీశాడు అందరూ కూడా బెస్ట్ ఇచ్చారు. త్వరలోనే సినిమా థియేటర్స్ కి రాబోతుంది. ఇక్కడి నుంచి ప్రమోషన్ స్టార్ట్ చేస్తున్నాం. ప్రమోషన్ మెటీరియల్ చాలా బాగా వచ్చింది.మీరందరూ కూడా దాన్ని బాగా క్యారీ చేస్తారని నమ్ముతున్నాము. అందరికీ థాంక్యూ.
తారాగణం: తరుణ్ భాస్కర్, ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి, విష్ణు ఓయి, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్, తదితరులు
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: కాశ్యప్ శ్రీనివాస్
సమర్పణ: పవన్ సాదినేని
నిర్మాతలు: కళ్యాణ చక్రవర్తి మంతిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సాల్
బ్యానర్లు: సప్తస్వ మీడియా వర్క్స్, POV స్టోరీస్, జీ స్టూడియోస్
DoP: విద్యా సాగర్ చింత
సంగీతం: స్వీకర్ అగస్తీ
ఎడిటర్: విప్లవ్ నిషాదం
ప్రొడక్షన్ డిజైనర్: చంద్రిక గొర్రెపాటి
కథ: సూర్య ప్రకాష్ జ్యోసుల
కాస్ట్యూమ్ డిజైనర్: అపూర్వ రెడ్డి
క్రియేటివ్ ప్రొడ్యూసర్: శ్రీని జోస్యుల
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: పెన్మత్స అజయ్ వర్మ
PRO: వంశీ-శేఖర్
డిజిటల్ మీడియా: హ్యాష్‌ట్యాగ్ మీడియా
సౌండ్ డిజైన్: సింక్ సినిమాస్
Vfx & టైటిల్ యానిమేషన్: ఎగ్ వైట్
పబ్లిసిటీ డిజైన్: ఎల్లోటూత్స్
తాజా వార్తలు
- అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఇన్ఫ్లుయెన్సర్
- పెయింటింగ్ లో విశ్వగురు వరల్డ్ రికార్డ్ సాధించిన చిన్నారి ప్రవ్య అదిత్రి
- చంద్రయాన్-4 ల్యాండింగ్ సైట్ ఫిక్స్
- ఘనంగా విశ్వగురు వరల్డ్ రికార్డు స్వామి వివేకానంద ఇండియన్ ఐకాన్ అవార్డ్స్ వేడుక
- భయం వల్లే ప్రధాని మోదీ లోక్‌సభకు రావట్లేదు: రాహుల్ గాంధీ
- విశాఖ టు చెన్నై..క్రూయిజ్ షిప్ విహారానికి ఏర్పాట్లు
- మున్సిపల్ ఎన్నికల్లో మధ్య త్రిముఖ పోటీ: సీఎం రేవంత్
- మచిలీపట్నం పోర్ట్ అభివృద్ధికి కీలక నిర్ణయాలు: ఎంపీ బాలశౌరి
- ఖతార్ లో ముగిసిన ఆర్ట్ బాసెల్ ఫస్ట్ ఎడిషన్..!!
- రియాద్‌లో వరల్డ్ డిఫెన్స్ షో 2026 ప్రారంభం..!!









