యూకే యువరాజు విలియంకు సౌదీ క్రౌన్ ప్రిన్స్ స్వాగతం..!!

- February 10, 2026 , by Maagulf
యూకే యువరాజు విలియంకు సౌదీ క్రౌన్ ప్రిన్స్ స్వాగతం..!!

దిరియా: సౌదీ క్రౌన్ ప్రిన్స్ మరియు ప్రధాన మంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్, బ్రిటన్ యువరాజు విలియంను దిరియాలో స్వాగతం పలికారు. అనంతరం సౌదీ అరేబియా జన్మస్థలం మరియు మొదటి సౌదీ రాజధాని అయిన దిరియాలో యువరాజు విలియంతో కలిసి పర్యటించారు.  ఈ పర్యటనలో భాగంగా చారిత్రాత్మక అట్-తురైఫ్ జిల్లాలో పర్యటించారు. అక్కడ యువరాజు విలియంకు సాంప్రదాయ నజ్దీ ఆర్కిటెక్చర్ గురించి వివరించారు. మొదటి సౌదీ  ఇమామ్‌లు మరియు పాలకుల రాజభవనాలను ఆయన సందర్శించారు. దిరియాలోని అత్యంత ప్రముఖ చారిత్రక కట్టడాలలో ఒకటి మరియు పూర్వ పరిపాలనా కేంద్రమైన సల్వా ప్యాలెస్ ముందు ఒక ఫోటోను తీసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.  అలాగే, దిరియా గేట్ మాస్టర్ ప్లాన్‌పై నిర్వహించిన ఒక ప్రదర్శనను చూసి, సౌదీ ముందుచూపును అభినందించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com