ఆంధ్రప్రదేశ్: మార్చి 6 వరకు అసెంబ్లీ సమావేశాలు
- February 11, 2026
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. అయితే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను మార్చి 6వ తేదీ వరకు నిర్వహించాలని బిజినెస్ అడ్వైజరీ కమిటీ భేటీలో నిర్ణయించారు. 16 రోజులపాటు సమావేశాలు జరగనున్నాయి. ఈ నెల 14న బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.
ఫిబ్రవరి 17, 18 తేదీల్లో బడ్జెట్‌పై సుదీర్ఘ చర్చ జరగనుంది. చర్చ అనంతరం 18వ తేదీన ఆర్థిక మంత్రి బడ్జెట్‌పై సభకు సమాధానం ఇవ్వనున్నారు. ఫిబ్రవరి 15న మహాశివరాత్రి కావడంతో, మరుసటి రోజున అంటే 16వ తేదీన సభకు సెలవు ప్రకటించారు. పరిస్థితులను బట్టి అవసరమైతే సమావేశాలను మరికొన్ని రోజులు పొడిగించే అవకాశం కూడా ఉందని బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. ప్రజా సమస్యలు, సంక్షేమ పథకాలపై ఈ సమావేశాల్లో కీలక చర్చలు జరిగే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- సామాజిక రక్షణ పథకాల కవరేజ్ గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపి బాలశౌరి
- అమెరికా ప్రభుత్వానికి భారత్ తలొగ్గింది..రాహుల్‌గాంధీ
- రేపు భారత్ బంద్..
- ఆంధ్రప్రదేశ్: మార్చి 6 వరకు అసెంబ్లీ సమావేశాలు
- జీసీసీ కీలక కస్టమ్స్ అథారిటీ సమావేశం..కీలక సమీక్షలు..!!
- సౌదీలో 40శాతం తగ్గిన క్రోనిక్ డిసీజ్ డెత్స్..!!
- ప్రపంచంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయంగా DXB..!!
- ట్రాఫిక్ అలెర్ట్..అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ మూసివేత..!!
- ఫక్ కుర్బా కింద 8వేల మందికి పైగా విడుదల..!!
- బహ్రెయిన్‌లో ఇండియన్ బడ్జెట్ 2026పై సెమినార్..!!









