దుబాయ్ లో వర్క్, బిజినెస్ వల్లే 90% ట్రాఫిక్ రద్దీ..!!
- February 12, 2026
యూఏఈ: దుబాయ్ రోడ్లపై దాదాపు 90 శాతం ట్రాఫిక్ కు కారణం వ్యాపారాలు మరియు రోజువారీ పని సంబంధిత ప్రయాణాలే అని ఎమిరాటీ రోడ్డు భద్రత మరియు ట్రాఫిక్ నిపుణుడు డాక్టర్ ముస్తఫా అల్దా విశ్లేషించారు. అత్యధికంగా ట్రాఫిక్ పర్యటనలు లేదా షాపింగ్ వల్ల కాదని, 90శాతం ట్రాఫిక్ కార్యాలయాలు, పాఠశాలలు మరియు వాణిజ్య కార్యకలాపాల వల్ల ఏర్పడుతుందని పేర్కొన్నారు.
దుబాయ్ లో గత కొన్ని సంవత్సరాలుగా జనాభా వేగంగా పెరుగుతోందని అన్నారు. అనేక మంది ఉద్యోగులు తమ కార్యాలయాల సమీపంలో నివసించరని, చాలా ఉద్యోగాలు ఆన్-సైట్ వసతిని అందించవని, ఫలితంగా, వేలాది మంది నివాసితులు ప్రతిరోజూ ఎక్కువ దూరం ప్రయాణించాల్సి వస్తుందని డాక్టర్ ముస్తఫా అల్దా పేర్కొన్నారు.
రోజువారీ ట్రాఫిక్ రద్దీని ఎలా ప్రభావితం చేస్తుందో డాక్టర్ అల్డా పాఠశాను ఉదాహరణగా తెలిపారు. 1,000 మంది విద్యార్థులు ఉన్న పాఠశాల దాదాపు 20 బస్సులను ఉపయోగించి వారిని ట్రాన్స్ పోర్ట్ చేస్తుంది. కానీ ప్రతి విద్యార్థిని తల్లిదండ్రులు దింపితే, అంటే ఒకేసారి రోడ్డుపై 1,000 కార్లు ఉంటాయని, దీంతో ట్రాఫిక్ పెరిగి సమస్యలు ఎదురవుతాయని ఆయన వివరించారు.
అయితే, గంటకు నిర్దిష్ట సంఖ్యలోనే వాహనాలు వెళ్లేలా రోడ్ల నిర్మాణం ఉంటుందని, ఆ పరిమితిని చేరుకున్న తర్వాత ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతుందని పేర్కొన్నారు. దుబాయ్ అభివృద్ధి చెందుతున్న కొద్దీ ట్రాఫిక్ సమస్యలు పెరుగుతాయని, ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ట్రాఫిక్‌ను మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి మరిన్ని అధ్యయనాలు చేయాల్సిన అవసరం ఉందని డాక్టర్ ముస్తఫా అల్దా పేర్కొన్నారు. ట్రాఫిక్ సమస్యలకు సరైన పరిష్కారాలను గుర్తించేందుకు వీలుగా మరిన్ని అధ్యయనాలను చేయించాలని యూఏఈ ప్రభుత్వాన్ని కోరారు.
తాజా వార్తలు
- భారీ వర్షాలు..అధికారులను అప్రమత్తం చేసిన సీఎం చంద్రబాబు!
- హైదరాబాద్ విమానాశ్రయం–బ్రస్సెల్స్ విమానాశ్రయం మధ్య అవగాహన ఒప్పందం
- గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీలో వైట్ కోట్ సెరిమనీ
- ఉత్తరాంధ్రలో కురుస్తున్న భారీ వర్షాలు.. పలు విమానాల దారి మళ్లింపు
- మారిషస్‌లో డా.గజల్ శ్రీనివాస్‌కు ‘విశ్వ సంగీత శాంతి దూత’ పురస్కారం
- ఇరాన్ 60 రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదన..హోర్ముజ్ జలసంధి పునఃప్రారంభానికి ‘రోడ్‌మ్యాప్’
- మామునూరు, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టులకు పేర్లు ఖరారు?
- అమెరికాలో ల్యాండైన జిన్‌పింగ్
- రోడ్డుపై చీపురు పట్టిన పోలీస్ అధికారి.. వీడియో వైరల్..!!
- ఏఐ వినియోగంలో సైబర్ భద్రతపై చర్చించిన నిపుణులు..!!







