ఒకే రోజు 3,206 ట్రాఫిక్ వయోలేషన్స్ నమోదు..!!
- February 12, 2026
కువైట్: కువైట్ లో ఒకేరోజు రికార్డు స్థాయిలో ట్రాఫిక్ వయోలేషన్స్ నమోదు కావడం సంచలనం సృష్టించింది. ముఖ్యంగా ఆసుపత్రుల పరిసరాల్లో నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం మరియు అక్రమ పార్కింగ్ లక్ష్యంగా దేశవ్యాప్తంగా నిర్వహించిన తనిఖీలలో జనరల్ ట్రాఫిక్ డైరెక్టరేట్ ఫిబ్రవరి 11వ తేదీన 3,206 ట్రాఫిక్ ఉల్లంఘనలను నమోదు చేయడంతోపాటు 47 వాహనాలు మరియు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
ఆస్పత్రి వంటి నిషేధిత ప్రాంతాలలో వాహనదారులు పలు ఉల్లంఘనలకు పాల్పడుతున్నారన్న ఫిర్యాదులు రావడంతో స్పెషల్ డ్రైవ్ చేపట్టినట్లు ట్రాఫిక్ డైరెక్టరేట్ తెలిపింది. ఇక అల్-అహ్మది గవర్నరేట్ 570 ఉల్లంఘనలతో అగ్రస్థానంలో ఉండగా, ఆ తర్వాతి స్థానాల్లో అల్-ఫర్వానియా 536, కాపిటల్ గవర్నరేట్ 451, అల్-జహ్రా 358 ఉల్లంఘనలతో ఉన్నాయి.
డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్‌లను ఉపయోగించడం, సీట్‌బెల్ట్‌లు ధరించకపోవడం, అక్రమంగా విండో టిన్టింగ్ చేయడం మరియు ఇబ్బందికరమైన శబ్దాలను మోగించడం లాంటి అనేక ట్రాఫిక్ ఉల్లంఘనలు ఉన్నాయని ట్రాఫిక్ డైరెక్టరేట్ వెల్లడించింది.
తాజా వార్తలు
- దుబాయ్ డ్యూటీ ఫ్రీలో $1 మిలియన్ గెలిచిన భారతీయుడు..!!
- GCC-ASEAN మధ్య ఆర్థిక, వాణిజ్య సహకార విస్తరణపై చర్చలు..!!
- భారీ వర్షాలు..అధికారులను అప్రమత్తం చేసిన సీఎం చంద్రబాబు!
- హైదరాబాద్ విమానాశ్రయం–బ్రస్సెల్స్ విమానాశ్రయం మధ్య అవగాహన ఒప్పందం
- గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీలో వైట్ కోట్ సెరిమనీ
- ఉత్తరాంధ్రలో కురుస్తున్న భారీ వర్షాలు.. పలు విమానాల దారి మళ్లింపు
- మారిషస్‌లో డా.గజల్ శ్రీనివాస్‌కు ‘విశ్వ సంగీత శాంతి దూత’ పురస్కారం
- ఇరాన్ 60 రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదన..హోర్ముజ్ జలసంధి పునఃప్రారంభానికి ‘రోడ్‌మ్యాప్’
- మామునూరు, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టులకు పేర్లు ఖరారు?
- అమెరికాలో ల్యాండైన జిన్‌పింగ్







