బహదూర్ అలికి 12 రోజుల రిమాండ్ విధించిన ఎన్ఐఏ
- July 30, 2016
పాకిస్తానీ ఉగ్రవాది బహదూర్ అలికి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) 12 రోజుల రిమాండ్ విధించింది. ప్రాణాలతో పట్టుబడ్డ బహదూర్ అలి... అలియాస్ సైఫుల్లాను ఎన్ఐఏ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.కశ్మీర్ భద్రతా దళాలతో జరిగిన ఎన్ కౌంటర్ లో మరో నలుగురు ఉగ్రవాదులు చనిపోగా బహదూర్ అలి ప్రాణాలతో చిక్కిన విషయం తెలిసిందే. అలిని అదుపులోకి తీసుకున్న భద్రతా దళాలు అప్పటినుంచీ ఎన్ఐఏ పర్యవేక్షణలోనే ఉంచారు. ఈ నేపథ్యంలో విచారించిన ఎన్ఐఏ ముందు బహదూర్.. పలు సంచలన విషయాలను వెల్లడించాడు. కశ్మీర్ లో అమాయక పౌరులన్ని చంపేందుకే తాను వచ్చినట్లు ఎన్ఐఏ కు చెప్పిన బహదూర్... తనకు లష్కరే తోయిబా శిక్షణ ఇచ్చినట్లు తెలిపాడు. అంతేకాక తాను జెఈఎమ్ అధినేత హపీజ్ సయీద్ ను సైతం రెండుసార్లు కలిశానని, పాక్ ఆక్రమిత కశ్మీర్ లో నెలకొన్న కంట్రోల్ రూమ్ తో రెగ్యులర్ టచ్ లోనే ఉన్నట్లు పేర్కొన్నాడు. బహదూర్ ఆసక్తికర, ఆశ్చర్యకర విషయాలను వెల్లడించిన అనంతరం.. హోం మంత్రిత్వశాఖ అతడిని పాకిస్తానీ పౌరుడుగా నిర్థారించింది. ఈ నేపథ్యంలో బహదూర్ ను ఆగస్టు 11 వరకూ ఎన్ఐఏ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







