ఐరన్‌మ్యాన్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌.. పాక్షిక ట్రాఫిక్ ఆంక్షలు..!!

- February 13, 2026 , by Maagulf
ఐరన్‌మ్యాన్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌.. పాక్షిక ట్రాఫిక్ ఆంక్షలు..!!

మస్కట్: ఐరన్‌మ్యాన్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా జరిగే "IRONKIDS" పిల్లల రేసు సందర్భంగా పాక్షిక ట్రాఫిక్ ఆంక్షలను రాయల్ ఒమన్ పోలీసులు ప్రకటించారు.  రేస్ రూట్‌కు ఇరువైపులా పార్కింగ్ చేయడం పై నిషేధం ఉందని గుర్తుచేశారు. రేస్ సరిగ్గా శుక్రవారం మధ్యాహ్నం 3:00 గంటలకు అల్ ఖరిజియా రౌండ్‌అబౌట్ నుండి ప్రారంభమవుతుందని, అల్ ఖురుమ్‌లోని అల్ షాతి స్ట్రీట్ వెంట కొనసాగుతూ.. అల్ షాతి రౌండ్‌అబౌట్ దగ్గరగా వెళ్లి.. తిరిగి అదే మార్గంలో అల్ షాతి స్ట్రీట్‌లోని ముగింపు లైన్ కు చేరుకుంటుంది. పిల్లల రేసు సాయంత్రం 5:30 గంటల వరకు కొనసాగుతుందని, అప్పటి వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com