హవాలీ లో మెడికల్ సెంటర్‌ సీజ్..!!

- February 13, 2026 , by Maagulf
హవాలీ లో మెడికల్ సెంటర్‌ సీజ్..!!

కువైట్: హవాలీ ప్రాంతంలోని సరైన లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న ఒక వైద్య కేంద్రాన్ని పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్ సీజ్ చేసింది.  ఈ తనిఖీలను నేర పరిశోధన విభాగం, వాణిజ్య మంత్రిత్వ శాఖ మరియు లైసెన్సింగ్ విభాగం,  డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఆరోగ్య మంత్రిత్వ శాఖ సహకారంతో నిర్వహించారు. 

కేవలం డెర్మటాలజీ క్లినిక్‌గా పనిచేయడానికి మాత్రమే లైసెన్స్ తీసుకొని ఇతర వైద్య సేవలను అందిస్తున్నారని అథారిటీ పేర్కొంది. మహిళలు మరియు మెటర్నిటీ క్లినిక్, డెంటల్ క్లినిక్ మరియు హెయిర్ కేర్ చికిత్స మరియు హెయిర్ ట్రాన్స్‌ ప్లాంట్ సేవలు సహా అనేక ఇతర లైసెన్స్ లేని వైద్య కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని విచారణ అధికారులు గుర్తించారు. ఈ రైడ్స్ లో భాగంగా పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.  ప్రభుత్వ సంస్థల సహకారంతో ఉమ్మడిగా తనిఖీలు కొనసాగుతాయని పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్ స్పష్టం చేసింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com