భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. Dh7,000 ఖర్చు చేస్తున్న ఫ్యాన్స్..!!

- February 13, 2026 , by Maagulf
భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. Dh7,000 ఖర్చు చేస్తున్న ఫ్యాన్స్..!!

యూఏఈ: ఈ ఆదివారం భారత్-పాకిస్తాన్ T20 మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూడటానికి యూఏఈలోని క్రికెట్ అభిమానులు కొలంబో పర్యటన కోసం Dh6,500 కంటే ఎక్కువ ఖర్చు చేసేందుకు సిద్ధమవుతున్నారు. మ్యాచ్‌కు ముందు విమాన ఛార్జీలు పెరగడం మరియు హోటల్ ధరలు పెరగడంతో ఈ ఖర్చు పెరిగిందని క్రికెట్ ఫ్యాన్స్ చెబుతున్నారు. మ్యాచ్ సమయంలో దుబాయ్ నుండి కొలంబోకు తిరుగు ప్రయాణ టిక్కెట్లు ప్రస్తుతం సగటున Dh3,700 వరకు ఉన్నాయని, ఇది బుకింగ్ సమయంలో విమాన తేదీలు మరియు లభ్యతను బట్టి మారుతూ ఉంటుందని ట్రావెల్ ఏజెంట్లు చెబుతున్నారు.  

శుక్రవారం బయలుదేరే డైరెక్ట్ ఫ్లైట్స్ సగటున Dh1,680 ఉండగా, మూడు రోజుల తర్వాత తిరుగు ప్రయాణ టిక్కెట్లు Dh1,200 పలుకుతున్నాయి. ఇక శనివారం ప్రయాణించే వారికి, ఛార్జీలు సగటున Dh2,000 వరకు ఉంటాయని, మంగళవారం రిటర్న్‌ లు Dh1,600 వరకు ఉంటాయని తెలిపారు. మ్యాచ్ డేట్ సమీపిస్తున్న కొద్దీ ధరలు పెరగడానికి అవకాశం ఉందని పేర్కొన్నారు.  

స్టేడియంలో భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌లను చూడటం తనకు  ఎంతో ఇష్టమని దుబాయ్‌ కు చెందిన వ్యాపారవేత్త జహాన్‌జేబ్ తెలిపారు.  కొలంబోలో జరిగే మ్యాచుకు హాజరు కావడానికి  కొన్ని రోజుల క్రితం తన రిటర్న్ టికెట్‌ను బుక్ చేసుకున్నట్టు,  ఛార్జీలు పెరగకముందే Dh2,300 చెల్లించినట్లు తెలిపాడు. అతను శుక్రవారం విమానంలో బయలుదేరి మంగళవారం తిరిగి వస్తున్నాడు. ఈ ట్రిప్‌ తనకు స్మాల్ వీకెండ్ గా మారిందని తెలిపాడు.

అతను సెంట్రల్ కొలంబోలో సుమారు Dh2,200 ఖర్చుతో మూడు రాత్రులకు ఒక హోటల్‌ను కూడా బుక్ చేసుకున్నాడు. ప్రస్తుతం మ్యాచ్ వారాంతంలో ఫైవ్ స్టార్ హోటల్ లో నాలుగు రోజుల స్టే కు సగటున Dh1,800 మరియు Dh4,000 మధ్య అవుతుంది.

ఇక మ్యాచ్ చూసేందుకు గ్రౌండ్ లో సీటింగ్ కేటగిరీని బట్టి మ్యాచ్ టిక్కెట్ ధరలు మారుతూ ఉంటాయి.  యావరేజ్ గా Dh400 మరియు Dh600 మధ్య ఉంటాయి. విమానాలు, హోటల్ స్టే మరియు మ్యాచ్ టిక్కెట్లతో పాటు స్థానిక ట్రాన్స్ పోర్ట్, ఫుడ్, లోకల్ విజిట్స్ ఇలా మొత్తం కలిపి Dh600 నుండి Dh800 వరకు అవుతాయని జహాన్‌జేబ్ పేర్కొన్నాడు. అన్ని ఖర్చులను కలిపితే, తన చిన్న వీకెండ్ పర్యటన ఖర్చు Dh6,000 నుండి Dh7,000 వరకు చేరుకుంటుందని వివరించాడు.   

వైజ్‌ఫాక్స్ ట్రావెల్ అండ్ టూరిజం సీనియర్ మేనేజర్ సుబైర్ థెకేపురథ్వలప్పిల్ మాట్లాడుతూ..  ఎమిరేట్స్ నుంచి డై-హార్డ్ క్రికెట్ అభిమానులలో బలమైన డిమాండ్ ఉందని అన్నారు. అలాగే ఇండియా, పాకిస్థాన్ లకు చెందిన క్రికెట్ అభిమానులలో భారీ డిమాండ్ ఉందని,  శ్రీలంక కు వీసా ప్రక్రియ సులభం అని, శ్రీలంక ఇప్పటికే ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా గుర్తింపు పొందిందని ఆయన అన్నారు. అలాగే, మ్యాచ్ అనంతరం అక్కడి నుంచి ఇండియా, పాకిస్థాన్ లకు కనెక్టివిటీ మెరుగ్గా ఉండటంతో సహజంగానే అనేక మంది అక్కడికి వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారని సుబైర్ పేర్కొన్నాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com