ఎయిర్ ఇండియాకు భారీ షాక్..రూ.కోటి జరిమానా
- February 13, 2026
న్యూ ఢిల్లీ: నిబంధనల ఉల్లంఘన పై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) కఠిన చర్యలు చేపట్టింది. విమానయాన భద్రతా ప్రమాణాలను విస్మరించినందుకు గాను ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాకు రూ. 1 కోటి జరిమానా విధిస్తూ ఫిబ్రవరి 5న కీలక ఆదేశాలు జారీ చేసింది.ఈ మొత్తాన్ని నెల రోజుల్లోపు చెల్లించాలని స్పష్టం చేసింది.
గతేడాది నవంబర్ 24, 25 తేదీల్లో ఎయిర్ ఇండియాకు చెందిన ఒక ఎయిర్‌బస్ ఏ320 విమానం, తప్పనిసరిగా ఉండాల్సిన ఎయిర్‌వర్తినెస్ రివ్యూ సర్టిఫికేట్ (ARC) లేకుండానే కార్యకలాపాలు సాగించింది. తగిన అనుమతులు మరియు భద్రతా తనిఖీలు లేకపోయినప్పటికీ, ఆ రెండు రోజుల వ్యవధిలో ఏకంగా ఎనిమిది సార్లు ఈ విమానాన్ని నడిపినట్లు విచారణలో వెల్లడైంది.
ఈ వ్యవహారం పై డీజీసీఏ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సరైన ధృవీకరణ పత్రాలు లేకుండా విమానాలను నడపడం వల్ల ప్రయాణికుల భద్రత ప్రమాదంలో పడటమే కాకుండా, విమానయాన రంగంపై ప్రజలకు ఉన్న విశ్వాసం దెబ్బతింటుందని ఆరోపించింది. నిబంధనల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం క్షమించరానిదని ఈ సందర్భంగా డీజీసీఏ పేర్కొంది.
తాజా వార్తలు
- తెలంగాణ: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు..
- మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా...మెజారిటీ స్థానాలు కైవసం
- కెనడా పై యూఏఈ విజయం
- ఎయిర్ ఇండియాకు భారీ షాక్..రూ.కోటి జరిమానా
- వంశీ ఆర్ట్స్ థియేటర్స్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.వి.పట్టాభిరామ్ 76వ జయంతి వేడుకలు
- ఢిల్లీ మెట్రో రైల్ లో ఉపాధి అవకాశాలు
- నాలుగు కొత్త అబ్షర్ సేవలు ప్రారంభం..!!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. Dh7,000 ఖర్చు చేస్తున్న ఫ్యాన్స్..!!
- హవాలీ లో మెడికల్ సెంటర్ సీజ్..!!
- మెరైన్ స్పోర్ట్స్ లో పాల్గొన్న బహ్రెయిన్ కింగ్..!!









