'విష్ణు విన్యాసం' నుంచి బ్యూటీఫుల్ లవ్ సాంగ్ మొదలే మొదలే రిలీజ్
- February 13, 2026
కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ శ్రీ విష్ణు, నయన సారిక 'విష్ణు విన్యాసం' నుంచి బ్యూటీఫుల్ లవ్ సాంగ్ మొదలే మొదలే రిలీజ్
కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ శ్రీ విష్ణు 'విష్ణు విన్యాసం' అనే యూనిక్ ప్రాజెక్ట్‌తో అలరించబోతున్నారు. నూతన దర్శకుడు యదునాథ్ మారుతి రావు ఈ చిత్రానికి దర్శకత్వం. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ నాయుడు జి నిర్మించిన ఈ చిత్రాన్ని హేమ, షాలిని సమర్పిస్తున్నారు, సుబ్రహ్మణ్యం నాయుడు జి, రామచారి ఎం సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
ఈ సినిమా టైటిల్ గ్లింప్స్, ఫస్ట్ సింగిల్ 'దేఖో విష్ణు విన్యాసం'కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
ఈ రోజు మేకర్స్ సెకండ్ సింగిల్ మొదలే మొదలే సాంగ్ రిలీజ్ చేశారు. సంగీత దర్శకుడు రధన్ ఈ సాంగ్ ని బ్యూటీఫుల్ లవ్ మెలోడీగా కంపోజ్ చేశారు.
రామజోగయ్య శాస్త్రి రాసిన సాహిత్యం లవ్ ఫీలింగ్ ని అందంగా ప్రజెంట్ చేసింది. మధుశ్రీ, నరేష్ అయ్యర్ వోకల్స్ మరింత మెలోడీని యాడ్ చేశాయి.
ఈ సాంగ్ లో శ్రీ విష్ణు, నయన సారిక కెమిస్ట్రీ లవ్లీగా ఆకట్టుకుంది. వాలెంటైన్స్ డే కి పర్ఫెక్ట్ గిఫ్ట్ గా నిలిచే ఈ సాంగ్ ఇన్‌స్టంట్ హిట్‌గా అలరిస్తోంది.
ఈ చిత్రంలో సత్య, బ్రహ్మాజీ, ప్రవీణ్, మురళి శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, సత్యం రాజేష్, శ్రీనివాస్ వడ్లమాని, గోపరాజు రమణ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీని అందించగా, ఎ. రమణాంజనేయులు ఆర్ట్ డైరెక్టర్, కార్తికేయన్ రోహిణి ఎడిటర్
ఈ చిత్రాన్ని త్వరలోనే థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
తారాగణం: శ్రీ విష్ణు, నయన సారిక, సత్య, బ్రహ్మాజీ, ప్రవీణ్, మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, సత్యం రాజేష్, శ్రీనివాస్ వడ్లమాని, గోపరాజు రమణ
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: యదునాథ్ మారుతీ రావు
ప్రొడక్షన్ హౌస్: శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్
నిర్మాత: సుమంత్ నాయుడు జి
సమర్పణ: హేమ & షాలిని
సహ నిర్మాతలు: సుబ్రమణ్యం నాయుడు జి, రామాచారి ఎం
DOP: సాయి శ్రీరామ్
సంగీతం: రధన్
ఆర్ట్ డైరెక్టర్: ఎ. రామాంజనేయులు
లిరిక్స్: రామజోగయ్య శాస్త్రి
కొరియోగ్రఫీ: భాను మాస్టర్
పబ్లిసిటీ డిజైనర్: అనంత్ కంచెర్ల
PRO: వంశీ-శేఖర్
తాజా వార్తలు
- తెలంగాణ: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు..
- మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా...మెజారిటీ స్థానాలు కైవసం
- కెనడా పై యూఏఈ విజయం
- ఎయిర్ ఇండియాకు భారీ షాక్..రూ.కోటి జరిమానా
- వంశీ ఆర్ట్స్ థియేటర్స్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.వి.పట్టాభిరామ్ 76వ జయంతి వేడుకలు
- ఢిల్లీ మెట్రో రైల్ లో ఉపాధి అవకాశాలు
- నాలుగు కొత్త అబ్షర్ సేవలు ప్రారంభం..!!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. Dh7,000 ఖర్చు చేస్తున్న ఫ్యాన్స్..!!
- హవాలీ లో మెడికల్ సెంటర్ సీజ్..!!
- మెరైన్ స్పోర్ట్స్ లో పాల్గొన్న బహ్రెయిన్ కింగ్..!!









