ఆగస్టు 19న చుట్టాలబ్బాయి రిలీజ్ ..
- July 30, 2016
మంచి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న యంగ్ హీరో ఆది.. భారీ పోటీలో సినిమాను రిలీజ్ చేయడానికి ఇంట్రస్ట్ చూపించటం లేదు. అందుకే ముందుగా ఆగస్టు 5న తన లేటెస్ట్ మూవీ చుట్టాలబ్బాయి రిలీజ్ ప్లాన్ చేసినా.. ఇప్పుడు రేసు నుంచి తప్పకున్నాడు. అదే రోజు మరో రెండు సినిమాలు రిలీజ్ అవుతుండటంతో రిస్క్ ఎందుకన్న ఉద్దేశంతో తన సినిమాను వాయిదా వేశాడు.ఆగస్ట్ 5న రిలీజ్ అవుతున్న సినిమాల్లో మంచి అంచనాలు ఉన్న సినిమా శ్రీరస్తు శుభమస్తు.. ఈసారి ఎలాగైన హిట్ కొట్టాలన్న ఉద్దేశంతో అల్లు వారబ్బాయి శిరీష్.. పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాతో పాటు ప్రయోగాత్మక చిత్రాల దర్శకుడు చందశేఖర్ ఏలేటి దర్శకత్వంలో తెరకెక్కిన మనమంతా సినిమా కూడా అదే రోజు రిలీజ్ అవుతోంది. మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్ తొలి సారిగా చేస్తున్న తెలుగు సినిమా కావటంతో ఈ సినిమాపై కూడా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. దీంతో ఈ రెండు సినిమాలతో పోటి పడటం కన్నా సేఫ్ టైంలో సినిమా రిలీజ్ చేసుకోవటం బెటర్ అని ఫీల్ అవుతున్నాడు ఆది. అందుకే చుట్టాలబ్బాయి సినిమాను ఆగస్ట్ 19న తీరిగ్గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశాడు.
తాజా వార్తలు
- రేపు ఢిల్లీలో కాంగ్రెస్ PCCల భేటీ
- పద్మ అవార్డు గ్రహీతలకు ప్రధాని మోదీ అభినందనలు
- డాక్టర్ నోరి దత్తత్రేయుడికి క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక సేవలకు పద్మభూషణ్
- నోరి దత్తత్రేయుడికి పద్మభూషణ్ ప్రకటించడం పై NATS హర్షం
- సౌదీ అరేబియాలో వైభవంగా ‘తెలుగింటి సంక్రాంతి’ సంబరాలు
- పద్మ అవార్డులు అందుకున్న సినీ ప్రముఖులు వీళ్ళే..
- అభిమానికి గోల్డ్ చెయిన్ గిఫ్ట్‌గా ఇచ్చిన తలైవా
- పరీక్షల ఒత్తిడి: యూఏఈ విద్యార్థులు–తల్లిదండ్రులు పాటించాల్సిన జాగ్రత్తలు
- నాంపల్లి అగ్నిప్రమాదం: మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు
- యూఏఈ ఇన్ఫ్లుయెన్సర్లకు బిగ్ అలర్ట్







