తరుణ్ భాస్కర్ కు లక్
- July 30, 2016
చిన్న సినిమాల సంచనలాను ఎక్కువవుతున్న ఈ తరుణంలో పెళ్లిచూపులు అంటూ వచ్చి హిలేరియస్ రెస్పాన్స్ తెచ్చుకున్నాడు దర్శకుడు తరుణ్ భాస్కర్. అనుకున్న కథను అనుకున్నట్టుగా తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్న ఈయన ఇప్పుడు ఓ అద్భుతమైన ఛాన్స్ అందుకున్నాడని టాక్. ఇక ఆ ఛాన్స్ ఏంటో కాదు విక్టరీ వెంకటేష్ ను డైరెక్ట్ చేసే అవకాశమట.పెళ్లిచూపులు కథ ముందు సురేష్ బాబుకి చెప్పాడట తరుణ్ భాస్కర్. అయితే కథ రిఫ్రెషింగ్ గా ఉన్నా నీట్ గా తీయగలుగుతారా లేదా అనే అపనమ్మకంతో సురేష్ బాబు దాన్ని వదిలేశారట. అయితే సురేష్ బాబు సహకారంతోనే రాజ్ కంకందుకూరిని తరుణ్ భాస్కర్ కు ఎటాచ్ చేశాడట. అభిరుచి గల నిర్మాత అవుధామనుకుంటున్న రాజ్ పెళ్లిచూపులు సినిమాను నిర్మించడం జరిగింది.ఇక సినిమా అంతా కొత్త అనుభూతిని ఇస్తుంది. అందుకే రివ్యూయర్లు కూడా సినిమా గురించి మంచి రేటింగ్ ఇచ్చారు. దర్శకుడు ఓ అద్భుతాలేం చేయాల్సిన అవసరం లేదు తాను చెప్పదలచుకున్న పాయింట్ ఆడియెన్స్ కు కనెక్ట్ అయ్యేలా చెబితే దానికి అందరు సహకరిస్తారు. అయితే ఈ సినిమా అవుట్ పుట్ చూశాక తరుణ్ మీద ఉన్న నమ్మకంతో వెంకటేష్ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.మరి మొదట ఓ చిన్న సినిమా చేసి ఆ తర్వాత సినిమానే వెంకటేష్ ను డైరెక్ట్ చేసే అవకాశం అంటే తరుణ్ భాస్కర్ లక్ ఎలా ఉందో చూడండి. టాలెంట్ ఉంటే ఎప్పటికైనా కచ్చితంగా అవకాశాలు వస్తాయి అని చెప్పడానికి తరుణ్ ఓ ఉదాహరణ. అంతేకాదు మొదటి సినిమాలో తన సత్తా చాటిన అతనికి ఓ స్టార్ గా రెండో సినిమా అవకాశం ఇస్తున్న విక్టరీ వెంకటేష్ కు కూడా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఇక ఈ కలయికలో వస్తున్న సినిమాను సురేష్ బాబు నిర్మిస్తారని సమాచారం.
తాజా వార్తలు
- రేపు ఢిల్లీలో కాంగ్రెస్ PCCల భేటీ
- పద్మ అవార్డు గ్రహీతలకు ప్రధాని మోదీ అభినందనలు
- డాక్టర్ నోరి దత్తత్రేయుడికి క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక సేవలకు పద్మభూషణ్
- నోరి దత్తత్రేయుడికి పద్మభూషణ్ ప్రకటించడం పై NATS హర్షం
- సౌదీ అరేబియాలో వైభవంగా ‘తెలుగింటి సంక్రాంతి’ సంబరాలు
- పద్మ అవార్డులు అందుకున్న సినీ ప్రముఖులు వీళ్ళే..
- అభిమానికి గోల్డ్ చెయిన్ గిఫ్ట్‌గా ఇచ్చిన తలైవా
- పరీక్షల ఒత్తిడి: యూఏఈ విద్యార్థులు–తల్లిదండ్రులు పాటించాల్సిన జాగ్రత్తలు
- నాంపల్లి అగ్నిప్రమాదం: మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు
- యూఏఈ ఇన్ఫ్లుయెన్సర్లకు బిగ్ అలర్ట్







