ఆన్‌లైన్ బెగ్గింగ్ మోసాలపై దుబాయ్ పోలీసుల వార్న్..!!

- February 17, 2026 , by Maagulf
ఆన్‌లైన్ బెగ్గింగ్ మోసాలపై దుబాయ్ పోలీసుల వార్న్..!!

యూఏఈ: పవిత్ర రమదాన్ మాసంలో ఆన్‌లైన్ బెగ్గింగ్ మోసాలకు బలికావద్దని దుబాయ్ పోలీసులు నివాసితులను హెచ్చరించారు.  వెబ్‌సైట్‌లు మరియు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో విస్తృతంగా అనుమానాస్పద విరాళాల అప్పీళ్లపై జాగ్రత్తంగా వ్యవహారించాలని సూచించింది.  సైబర్ మోసగాళ్ళు రమదాన్ తో ముడిపడి ఉన్న ఎమోషనల్ ను వాడుకొని బెగ్గింగ్ ప్రకటనలు రూపొందించి, అనధికార లింకుల ద్వారా మోసాలకు పాల్పడుతారని పోలీసులు హెచ్చరించారు.   

అన్ని విరాళాలు మరియు జకాత్ విరాళాలు యూఏఈలో అధికారికంగా లైసెన్స్ పొందిన మరియు స్వచ్ఛంద సంస్థల ద్వారా మాత్రమే అందించాలని అధికారులు తెలిపారు.  యూఏఈలో 2021 నాటి ఫెడరల్ డిక్రీ చట్టం నంబర్ 34 ఆన్‌లైన్ బెగ్గింగ్ పై నిషేధం ఉందని పోలీసులు గుర్తుచేశారు.  ఏ పద్ధతిలోనైనా భిక్షాటన చేస్తూ పట్టుబడితే మూడు నెలల వరకు జైలు శిక్ష మరియు 10,000 దిర్హామ్‌ల కంటే తక్కువ కాకుండా జరిమానా విధించే అవకాశం ఉందని పేర్కొన్నారు. 

దుబాయ్ పోలీస్ స్మార్ట్ అప్లికేషన్‌లో అందుబాటులో ఉన్న పోలీస్ ఐ సర్వీస్‌ను ఉపయోగించి లేదా అధికారిక E-క్రైమ్ ప్లాట్‌ఫామ్ లేదా టోల్-ఫ్రీ నంబర్ 901ని సంప్రదించడం ద్వారా అనుమానస్పద లింకుల వివరాలు, బెగ్గింగ్ కేసులను నివేదించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.   

గత సంవత్సరం బెగ్గింగ్ కార్యకలాపాలలో పాల్గొన్న 41 మంది అరబ్ జాతీయులను అరెస్టు చేశామని, అనుమానితులు విజిట్ వీసాలపై యూఏఈలోకి ప్రవేశించి, హోటళ్లలో వ్యవస్థీకృత భిక్షాటన నెట్‌వర్క్‌లో భాగంగా పనిచేస్తున్నట్లు విచారణలో గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com