లైసెన్స్ లేకుండా సేవలందిస్తే..SR2,600 ఫైన్..!!

- February 17, 2026 , by Maagulf
లైసెన్స్ లేకుండా సేవలందిస్తే..SR2,600 ఫైన్..!!

రియాద్: సౌదీ అరేబియాలో టాక్సీ మరియు ప్రయాణీకుల రవాణా కార్యకలాపాలను నియంత్రించే కార్యనిర్వాహక నిబంధనలు, ఉల్లంఘనలు, జరిమానాలను రవాణా జనరల్ అథారిటీ (TGA) ముసాయిదా సవరణను ప్రతిపాదించింది. లైసెన్స్ లేకుండా ప్రైవేట్ వాహనాన్ని నడుపుతున్న వ్యక్తులకు జరిమానాను SR2,600గా నిర్ణయించారు.    

అదే సమయంలో పట్టుబడిన సౌదీయేతర డ్రైవర్లను బహిష్కరించాలని, మొదటిసారి ఉల్లంఘన పునరావృతమైతే జరిమానాతోపాటు సొంత ఖర్చులతో లోకల్ గా ప్రచారం నిర్వహించాలని ప్రతిపాదించారు.   

ఎయిరుపోర్టుల్లో ప్రైవేట్ వాహనాలను నియంత్రించడంతోపాటు నిబంధనలు ఉల్లంఘించి పట్టుబడిన వారి లైసెన్స్‌ను పాక్షికంగా లేదా పూర్తిగా సస్పెండ్ చేయడం మరియు డ్రైవర్, వాహనం లేదా రెండింటినీ సీజ్ చేయడం వంటి నిబంధనలకు సవరణలు చేసినట్లు అథారిటీ వెల్లడించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com