బడ్జెట్ తర్వాత భారీగా పెరిగిన ‘సిగరెట్’ ధరలు
- February 17, 2026
న్యూ ఢిల్లీ: సిగరెట్ తాగేవారికి బిగ్ షాక్ ఈ నెల నుంచి సిగరేట్ల బ్రాండ్ల ధరలు పెరిగాయి. ప్రధాన మంత్రి మోడీ సర్కార్ ప్రవేశపెట్టిన బడ్జెట్ తర్వాత సిగరెట్ ధరలు అమాంతం పెరిగాయి. గతంలో ఉన్న జీఎస్టీ, సుంకాలను కేంద్రం భారీగా పెంచింది. పొగాకు ఉత్పత్తులపై సెస్‌లను పెంచడం వల్ల ధరలు పెరిగాయి. సిగరెట్ పొడవు, ఫిల్టర్‌ను బట్టి బడ్జెట్ పన్ను శ్లాబులను పొగాకు ఉత్పత్తులపై సవరించారు. ఇక వాటిపై సెస్ పెంచడంతో సిగరెట్ తయారీ కంపెనీలపై పన్ను భారం పెరిగింది. దీంతో కంపెనీలు ఈ అదనపు ఖర్చులను నేరుగా వినియోగదారులకు బదిలీ చేస్తున్నాయి. దీంతో రూ.10 విలువ చేసే సిగరెట్ రూ.13కి పెరిగింది. ఈ క్రమంలో సిగరెట్ అలవాటు ఉన్నవారికి బడ్జెట్ పెరగనుంది. ఏయే సిగరెట్ ధరలు ఎంత పెరిగాయో ఇప్పుడు చూద్దాం.
గోల్డ్ ఫ్లేక్ కింగ్ 10 సిగరెట్ల ప్యాకెట్ ధర 70 రూపాయలు పెరిగి 240కి చేరింది. క్లాసిక్ రెగ్యులర్, మైల్డ్, ఆల్ట్రా సిగరెట్ల ధరలు 140 రూపాయలు పెరిగి 480కి చేరాయి. క్లాసిక్ కనెక్ట్ 60 రూపాయలు పెరిగి 360కి చేరగా, గోల్డ్ ఫ్లేక్ సూపర్ స్టార్ 11 రూపాయలు పెరిగి 70కి చేరింది. మొత్తం మీద ధరలు 40 శాతానికి పైగా పెరిగాయి. ధరల పెంపుతో సిగరెట్ల కొరత ఏర్పడింది. సిగరెట్ ప్రియులు తక్కువ ధర సిగరెట్ల వైపు మొగ్గుచూపుతున్నారు.
తాజా వార్తలు
- విశాఖకు చేరుకున్న రాష్ట్రపతి ముర్ము
- ఎర్రవల్లి ఫామ్ హౌస్ వద్ద కార్యకర్తల సందడి
- పేరుకే ఏఐ సమ్మిట్.. నో యూపీఐ, నో కార్డ్.. ఓన్లీ క్యాష్
- శ్రీసిటీలో క్యారియర్ ఏసీ తయారీ యూనిట్ ప్రారంభం
- కోర్టు తీర్పు పై స్పందించిన ప్రత్యూష తల్లి
- ప్రధానిగా తారిక్ రెహమాన్ ప్రమాణ స్వీకారం
- ఐబొమ్మ’ రవికి బెయిల్ మంజూరు
- బడ్జెట్ తర్వాత భారీగా పెరిగిన ‘సిగరెట్’ ధరలు
- భారత్‌లో 38,500 దాటిన రిజిస్టర్డ్ డ్రోన్ల సంఖ్య
- సౌదీలోని కొన్ని నగరాల్లో తగ్గిన చలి..!!









