ఐబొమ్మ’ రవికి బెయిల్ మంజూరు
- February 17, 2026
హైదరాబాద్: మూవీ పైరసీ కేసులో అరెస్ట్ అయి జైలులో ఉన్న ఐబొమ్మ రవి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా రవికి తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఇమంది రవి ఎట్టి పరిస్థితుల్లోనూ దేశం విడిచి వెళ్లరాదని తన పాస్‌పోర్టును కోర్టులో సరెండర్ చేయాలని ఆదేశించింది. ప్రతి రోజు సీసీఎస్ ఎదుట హాజరు కావాలని, ఈ మేరకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
రవి ఇంటర్నెట్ వినియోగం పై కోర్టు పూర్తిస్థాయిలో ఆంక్షలు విధించింది. ఆయన ఎలాంటి ఇంటర్నెట్ సౌకర్యాన్ని సొంతంగా వాడకూడదని, ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో వాడాల్సి వస్తే కేవలం పోలీసుల ముందస్తు అనుమతితో మాత్రమే వినియోగించాలని స్పష్టం చేసింది. దీనితో పాటు నిందితుడు దేశం విడిచి వెళ్లకుండా కట్టడి చేస్తూ, ముందస్తు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లకూడదని ఆదేశించింది. భద్రతా చర్యల్లో భాగంగా రవి తన పాస్‌పోర్ట్‌ను వెంటనే కోర్టులో డిపాజిట్ చేయాలని న్యాయస్థానం కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
తాజా వార్తలు
- Four astronauts reach International Space Station in record time
- సౌదీలో హౌతీ బాలిస్టిక్ మిసైల్ కూల్చివేత..!!
- అక్టోబర్ నెలంతా దేశవ్యాప్త నిరసనలు.. CJP కీలక పిలుపు
- పైలట్ స్మిత్ మచ్చర్ కోలుకుంటున్నారు..భారత రాయబారి..!!
- మదీనాలో హౌతీ దాడి.. తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- షార్జా జ్యువెలరీ షోలో ప్రపంచంలోనే ఎత్తైన బంగారు బార్..
- కువైట్‌లో వర్షాలు.. తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- భారతీయులకు గుడ్ న్యూస్..హెచ్-1బి వీసా ఫీజు పై కీలక నిర్ణయం
- మహాత్ముడికి ప్రధాని మోడీ నివాళి







