ఎర్రవల్లి ఫామ్ హౌస్ వద్ద కార్యకర్తల సందడి
- February 17, 2026
హైదరాబాద్: బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పుట్టినరోజు వేడుకలు గజ్వేల్ నియోజకవర్గంలోని ఎర్రవల్లి ఫామ్ హౌస్ వద్ద అత్యంత కోలాహలంగా సాగుతున్నాయి. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి వచ్చిన కార్యకర్తలు, అభిమానులు తమ ప్రియతమ నాయకుడికి శుభాకాంక్షలు తెలిపేందుకు బారులు తీరారు. ఈ సందర్భంగా కేసీఆర్ స్వయంగా బయటకు వచ్చి తనను కలవడానికి వచ్చిన ప్రతి ఒక్కరిని చిరునవ్వుతో పలకరించారు. కార్యకర్తలతో కలిసి గ్రూప్ ఫొటోలు దిగుతూ, వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపారు. క్లిష్ట పరిస్థితుల్లో కూడా నాయకుడు తమ మధ్య ఉండి ధైర్యం చెప్పడంపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు, కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని రాజ్యసభ మాజీ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ వినూత్నంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా సంతోష్ కుమార్ ప్రారంభించిన ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’లో భాగంగా, ఈసారి గంగా-బ్రహ్మపుత్ర-మేఘన డెల్టా ప్రాంతంలో సుమారు 20 వేల మ్యాంగ్రూవ్ (మడ అడవులు) మొక్కలను నాటారు. ప్రకృతి సమతుల్యతను కాపాడటమే కేసీఆర్‌కు ఇచ్చే అసలైన బహుమతి అని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ పుట్టినరోజు వేళ పర్యావరణ హితమైన ఇటువంటి కార్యక్రమం చేపట్టడం చర్చనీయాంశంగా మారింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో మనీలాండరింగ్.. నలుగురు ఆసియన్లకు 5 ఏళ్ల జైలుశిక్ష..!!
- వాహనదారులకు సుప్రీం కోర్టు బిగ్ షాక్..
- శబరిమల యాత్రకు ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు..
- ప్రధాని మోదీతో ఫ్లైదుబాయ్ పైలట్ భావోద్వేగ సంభాషణ
- అదృష్టం కాదు.. ప్రణాళికే గల్ఫ్ దేశాల ఆర్థిక బలానికి కారణం..!!
- ఒమన్‌లో 2.56 లక్షలకు వృద్ధుల సంఖ్య..!!
- సౌదీలో హౌతీ బాలిస్టిక్ మిసైల్ కూల్చివేత..!!
- అక్టోబర్ నెలంతా దేశవ్యాప్త నిరసనలు.. CJP కీలక పిలుపు
- పైలట్ స్మిత్ మచ్చర్ కోలుకుంటున్నారు..భారత రాయబారి..!!
- మదీనాలో హౌతీ దాడి.. తీవ్రంగా ఖండించిన ఖతార్..!!







