విశాఖకు చేరుకున్న రాష్ట్రపతి ముర్ము
- February 17, 2026
విశాఖపట్నం: భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము విశాఖపట్నం చేరుకున్నారు. నౌకాదళ విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో వచ్చిన ఆమెకు రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, రాష్ట్ర మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి సాదరంగా స్వాగతం పలికారు. ఎంపీ శ్రీభరత్, మేయర్ పీలా శ్రీనివాస్, ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. (ఫిబ్రవరి 18) విశాఖ తీరంలో జరగనున్న ప్రతిష్ఠాత్మక ‘అంతర్జాతీయ యుద్ధనౌకల సమీక్ష-2026’కు రాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
భారత సాయుధ దళాల సుప్రీం కమాండర్‌గా ఆమె ఈ సమీక్షను పర్యవేక్షిస్తారు. ఈ కార్యక్రమంలో భారత నౌకాదళంతో పాటు పలు విదేశీ యుద్ధనౌకలు కూడా పాల్గొంటాయి.ఆమె పర్యటన నేపథ్యంలో విశాఖ నగరంలో పోలీసులు, నౌకాదళ అధికారులు పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
ఈ నేపథ్యంలో వివిధ దేశాల నౌకల రాక సైతం మొదలైంది.అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ, మిలన్ 2026, నేవీ చీఫ్‌ల కాన్ క్లేవ్కి విశాఖ నగరం వేదికైన తరుణంలో ఏర్పాట్లపై గత 3 నెలలుగా జిల్లా యంత్రాంగం పెద్ద కసరత్తే చేసింది. ఫిబ్రవరి 18న అంతర్జాతీయ యుద్ధనౌకల సమీక్ష (ఫ్లీట్ రివ్యూ-2026), 19న ఇంటర్నేషనల్ సిటీ పరేడ్, మిలన్, 20న ‘ఐయాన్స్ కాన్క్లేవ్ ఆఫ్ చీఫ్స్’ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
తాజా వార్తలు
- సౌదీలో అక్టోబర్ 7న నేషనల్ గ్రీనింగ్ సీజన్ ప్రారంభం..!!
- ఖతార్‌లో పటిష్టంగా సమాచార భద్రతా నిబంధనల అమలు..!!
- ఒమన్ న్యాయ వ్యవస్థలో డిజిటల్ సేవల విస్తరణ..!!
- మక్కాలో వేధింపులు.. భయాందోళనకు గురిచేసిన వ్యక్తి అరెస్ట్..!!
- కువైట్‌లో రెస్టారెంట్, ఫుడ్ గోడౌన్ సీజ్..!!
- బహ్రెయిన్‌లో మనీలాండరింగ్.. నలుగురు ఆసియన్లకు 5 ఏళ్ల జైలుశిక్ష..!!
- వాహనదారులకు సుప్రీం కోర్టు బిగ్ షాక్..
- శబరిమల యాత్రకు ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు..
- ప్రధాని మోదీతో ఫ్లైదుబాయ్ పైలట్ భావోద్వేగ సంభాషణ
- అదృష్టం కాదు.. ప్రణాళికే గల్ఫ్ దేశాల ఆర్థిక బలానికి కారణం..!!







