'మరకతమణి 2' పూజా కార్యక్రమంతో గ్రాండ్ గా ప్రారంభం

- February 17, 2026 , by Maagulf
\'మరకతమణి 2\' పూజా కార్యక్రమంతో గ్రాండ్ గా ప్రారంభం

2017లో విడుదలై తన మ్యాజికల్ కాన్సెప్ట్, కామెడీతో ఫాంటసీ కామెడీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న చిత్రం మరకతమణి. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా సీక్వెల్ 'మరకతమణి 2' అధికారికంగా ప్రారంభమైంది.

శివరాత్రి శుభ సందర్భంగా ఈ చిత్రం షూటింగ్ నిన్న (ఫిబ్రవరి 16, 2026) చెన్నైలో జరిగిన పూజా కార్యక్రమంతో ప్రారంభమైంది. హీరో కార్తీ క్లాప్‌ కొట్టగా, హీరో ఆర్య, దర్శకుడు వెంకట్ ప్రభు “కెమెరా రోలింగ్, యాక్షన్” అంటూ షూటింగ్ ప్రారంభించారు. యాక్సెస్ ఫిల్మ్ ఫ్యాక్టరీతో అనుబంధం వున్న అనేక మంది ప్రముఖలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ప్యాషన్ స్టూడియోస్, దంగల్ టీవీ, ఆర్‌డిసి మీడియా, యాక్సెస్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, గుడ్ షో బ్యానర్‌లపై సుధన్ సుందరం, మనీష్ సింఘాల్, దుర్గారం చౌదరి, దేవ్ & కెవి దురై నిర్మిస్తున్న ఈ చిత్రానికి గత బ్లాక్ బస్టర్ ‘మరకతమణి’కి దర్శకత్వం వహించిన ఎఆర్‌కె శరవణ్ దర్శకత్వం వహిస్తున్నారు.

మరకతమణి 2లో ఆది పినిశెట్టి, సత్యరాజ్, ప్రియా భవాని శంకర్, నిక్కీ గల్రానీ పినిశెట్టి, మునిష్కాంత్, ఆనందరాజ్, డానీ, అరుణ్‌రాజా కామరాజ్, మురుగానందం కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

సాంకేతిక విభాగంలో ధిబు నినన్ థామస్ సంగీతాన్ని అందిస్తుండగా, పీవీ శంకర్ సినిమాటోగ్రఫీ, ఎన్‌కే రాహుల్ ఆర్ట్ డైరెక్షన్, తిరుమలై రాజన్ ఆర్ ఎడిటింగ్, రాజేష్ కన్నన్ డైలాగ్స్, పీసీ స్టంట్స్ యాక్షన్ నిర్వహిస్తున్నారు.

అనౌన్స్మెంట్ నుంచి అంచనాలు భారీగా పెరగడంతో, మరకతమణి 2  మరింత వినోదం,  మ్యాజిక్, థ్రిల్లింగ్ అనుభూతిని అందించేందుకు సిద్ధమవుతోంది. చిత్రీకరణ విరామం లేకుండా కొనసాగనుండగా, త్వరలోనే మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్స్ రివిల్ చేయబోతున్నారు.
 
తారాగణం : ఆది పినిశెట్టి, సత్యరాజ్, ప్రియా భవానీ శంకర్,  నిక్కీ గల్రానీ పినిశెట్టి, మునిష్కాంత్, ఆనందరాజ్, డానీ, అరుణ్‌రాజా కామరాజ్, మురుగానందం

సాంకేతిక సిబ్బంది
దర్శకత్వం- ఆర్కే శరవణ్
సంగీతం- ధిబు నినాన్ థామస్
DOP - PV శంకర్
ఆర్ట్ డైరెక్టర్ - NK రాహుల్
ఎడిటర్-తిరుమలై రాజన్ ఆర్
డైలాగ్స్ - రాజేష్ కన్నన్
స్టంట్స్- PC స్టంట్స్
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ - ఎస్ఎస్ శ్రీధర్
కాస్ట్యూమ్ డిజైనర్ - ఎ. కీర్తివాసన్
కొరియోగ్రఫీ - రఘు థాపా
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - మోహన్ పి
ప్రొడక్షన్ మేనేజర్ - ఎస్ ప్రభాకర్
సౌండ్ డిజైన్ - సింక్ సినిమా
సౌండ్ మిక్సింగ్ - ఉదయ్ కుమార్
VFX - RESOL FX
VFX సూపర్‌వైజర్ - కిరణ్ రాఘవన్
మార్కెటింగ్ & ప్రమోషన్ - DEC
PRO - వంశీ శేఖర్

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com