నాన్ బహ్రెయిన్ ల నుండి BD3.99 మిలియన్ల ఫీ వసూలు..!!

- February 18, 2026 , by Maagulf
నాన్ బహ్రెయిన్ ల నుండి BD3.99 మిలియన్ల ఫీ వసూలు..!!

మనామా: 2023 ప్రారంభం నుండి 2025 చివరి వరకు ప్రభుత్వ ఆసుపత్రులు మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో నాన్ బహ్రెయిన్ పేషంట్ల నుండి BD3.98 మిలియన్లకు పైగా ఫీజులు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వసూలు చేసింది. ఈ మేరకు పార్లమెంటుకు నివేదిక సమర్పించారు.  ఎంపీ మహమూద్ ఫర్దాన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రిత్వ శాఖ ఈ వివరాలు వెల్లడించింది.  343,262 మందికి పైగా నాన్ బహ్రెయిన్ పేషంట్లు ఫీజు మినహాయింపు నిర్ణయం పరిధిలోకి రారని మంత్రిత్వ శాఖ తెలిపింది.  

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను 67,028 నాన్ బహ్రెయిన్లు సందర్శించారని, ప్రభుత్వ ఆసుపత్రులలో 47,105 మంది ఇన్‌పేషెంట్లుగా చేరారని మంత్రిత్వ శాఖ నివేదించింది.  అదే సమయంలో చట్టపరమైన నిబంధనల కింద అర్హులైన వారికి మానవతా సహాయం కింద మినహాయింపులు మంజూరు చేసినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com