సౌదీ అరేబియా నేటి నుంచే రమదాన్ ప్రారంభం..!!

- February 18, 2026 , by Maagulf
సౌదీ అరేబియా నేటి నుంచే రమదాన్ ప్రారంభం..!!

యూఏఈ: యూఈలో రమదాన్ నేటి నుంచి ప్రారంభమైంది. మంగళవారం నెలవంక కనిపించిన తర్వాత సౌదీ అరేబియా రమదాన్ మొదటి రోజును ప్రకటించింది. పవిత్ర మాసం ఫిబ్రవరి 18న ప్రారంభం కానుందని అధికారులు ప్రకటించారు.  రమదాన్ నెలవంకను సుదైర్ అబ్జర్వేటరీలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించిన చూసినట్లు ఖగోళ నిపుణుడు అబ్దుల్లా అల్-ఖుదైరి ప్రకటించారు.       

మరోవైపు పవిత్ర రమదాన్ మాసంలో ప్రైవేట్ రంగ ఉద్యోగులకు వర్కింగ్ అవర్స్ ను రెండు గంటలు తగ్గించారు.  ఈ మేరకు మానవ వనరులు మరియు ఎమిరేటైజేషన్ మంత్రిత్వ శాఖ (MoHRE) పేర్కొంది. ప్రభుత్వ రంగ ఉద్యోగుల వర్కింగ్ అవర్స్ సోమవారం నుండి గురువారం వరకు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2.30 గంటల వరకు,  శుక్రవారం రోజుల్లో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం వరకు ఉంటాయని ప్రకటించింది.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com