2.10లక్షల కేటాయింపుచెన్నై
- July 31, 2016
నేపాల్లో చిక్కుకున్న పది మంది తమిళుల్ని సురక్షితంగా ఢిల్లీకి చేర్చేందుకు ప్రత్యేక హెలికాప్టర్ ను ఏర్పాటు చేయాలని జయలలిత ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం రూ. 2.10 లక్షలు కేటాయించింది. కాంచీపురం జిల్లా వాసులు పది మంది ఇటీవల ముక్తినాథ్ ను సందర్శించేందుకు నేపాల్ వెళ్లారు. అయితే అక్కడ భారీ వర్షాలు, మంచు చరియలు విరిగి పడుతున్నాయి.ఈ నేపథ్యంలో సదరు తమిళవాసులు నేపాల్ లో చిక్కుకుపోయారు. దాంతో వారు నేపాల్ లోని భారత దౌత్య కార్యాలయ అధికారులను సంప్రదించారు. సదరు అధికారులు వెంటనే జయలలిత ప్రభుత్వాన్నికి సమాచారం అందించారు. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆమె ఆదేశించారు.ఢిల్లీలోని తమిళనాడు రాష్ట్రప్రభుత్వ అధికారుల పర్యవేక్షణలో ఈ ప్రయత్నాలు మొదలెట్టారు. ఆ పది మందిని సురక్షితంగా న్యూఢిల్లీకి తరలించి, అక్కడి నుంచి చెన్నైకు తీసుకొచ్చేందుకు తగ్గిన ఏర్పాట్లు జరుగుతున్నాయి.
తాజా వార్తలు
- తెలంగాణ: గణతంత్ర దినోత్సవం..తెలంగాణకు 23 పోలీస్ పతకాలు
- మంగళవారం బ్యాంక్ ఉద్యోగుల బంద్
- గణతంత్ర దినోత్సవం సందర్భంగా లోక్ భవన్లో జరిగిన తేనీటి విందు
- ఖతార్లో ఇండియా ఉత్సవ్.. గణతంత్ర దినోత్సవ వేడుకలు..!!
- భారత దేశవ్యాప్తంగా ఘనంగా గణతంత్ర వేడుకలు..
- కింగ్ ఖలీద్ ఎయిర్ పోర్టు టెర్మినల్ 2 ప్రారంభం..!!
- దుబాయ్లో ఘనంగా రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్..!!
- కువైట్ లో మరో బేబీ ఫార్ములా ఉపసంహరణ..!!
- మస్కట్లో వెల్లివిరిసిన భారత గణతంత్ర స్ఫూర్తి..!!
- బహ్రెయిన్ తేవర్ పెరవై ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం..!!







