ఈద్ సెలవులు 3 లేదా 4 రోజులు ఉంటాయా?

- February 19, 2026 , by Maagulf
ఈద్ సెలవులు 3 లేదా 4 రోజులు ఉంటాయా?

యూఏఈ: యూఏఈలో ఈద్ అల్ ఫితర్ సెలవుల కోసం ఇప్పటినుంచే ఫ్యామిలీలు ప్లాన్ చేసుకోవడం గురించి ఆలోచన చేస్తున్నాయి.  ఈ ఏడాది ఈద్ అల్ ఫితర్‌ సందర్భంగా మూడు రోజుల సెలవులు లభించనున్నాయి. యూఏఈ పబ్లిక్ హాలిడే క్యాలెండర్ ప్రకారం, మార్చి 20-22 తేదీల్లో ఈద్ అల్ ఫితర్‌ ను జరుపుకోనున్నారు.

అయితే, అధికారిక కమిటీలు మార్చి 18న వచ్చే రమదా 29వ రోజున సమావేశమై నెలవంకను చూసిన తర్వాత ఖచ్చితమైన తేదీలను ప్రకటిస్తారు. 

మార్చి 18న షవ్వాల్ నెలవంక కనిపిస్తే, మరుసటి రోజు, మార్చి 19న ఈద్ అల్ ఫితర్ ప్రకటించబడుతుంది. ఇది యూఏఈ నివాసితులకు మార్చి 19 నుండి మార్చి 22 వరకు నాలుగు రోజులపాటు సెలవులు వస్తాయి. సాధారణంగా ఆదివారం ఎమిరేట్స్‌లో అధికారిక వీకెండ్ లో భాగం.

మార్చి 18న నెలవంక కనిపించకపోతే, రమదాన్ పూర్తిగా 30 రోజుల పాటు కొనసాగుతుంది. ఈద్ మార్చి 20న ప్రారంభమవుతుంది.  అప్పుడు నివాసితులకు మూడు రోజుల పాటు సెలవులు మాత్రమే లభిస్తాయి.     

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com