మదీనాలో వార్షిక పర్యాటక వ్యయం 22% వృద్ధి..!!
- February 19, 2026
మక్కా: మదీనాలో వార్షిక పర్యాటక వ్యయం 22 శాతం పెరిగి SR52 బిలియన్లకు చేరుకుంది. 2025 సంవత్సరంలో సందర్శకుల సంఖ్య 21 మిలియన్లు దాటిందని టూరిజం మినిస్ట్రీ గణంకాలను వెల్లడించింది. 2025లో మదీనా మెరుగైన పర్యాటక పనితీరును నమోదు చేసింది. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా పవిత్ర నగరంలో లైసెన్స్ పొందిన హాస్పిటాలిటీ సంస్థల సంఖ్య 35 శాతం పెరిగి 610కి పెరిగింది. లైసెన్స్ పొందిన రూమ్స్ సంఖ్య 24 శాతం పెరిగి 76వేలు దాటిందని పేర్కొంది.
అదే సమయంలో ట్రావెల్ మరియు టూరిజం ఏజెన్సీల సంఖ్య కూడా 29 శాతం పెరిగి 240 కి చేరింది. ఇది పర్యాటక రంగ విస్తరణను ప్రతిబింబిస్తుందని సౌదీ అరేబియా పర్యాటక మంత్రి అహ్మద్ అల్-ఖతీబ్ వెల్లడించారు. "ది స్పిరిట్ ఆఫ్ రమదాన్ " అనే ఫీల్డ్ టూర్లో భాగంగా ఆయన మదీనాలో తనిఖీలు నిర్వహించారు. మదీనాలో ఆతిథ్య సౌకర్యాలు మరియు అందుతున్న సేవలను పరిశీలించారు.
తాజా వార్తలు
- వైరల్ వీడియోల పై ఒమన్ పోలీసులు దర్యాప్తు.. చట్టపరమైన చర్యలకు సిద్ధం
- ఎన్నిక ఏదైనా కూటమిదే ఘనవిజయం: మంత్రి కందుల దుర్గేష్
- దుబాయ్ మెరీనాలో 670 మంది కార్మికులకు భద్రత, సామాజిక అవగాహన కార్యక్రమాలు
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్‌లు విడుదల.. పరిమిత సంఖ్యలో విక్రయాలు
- గల్ఫ్ ప్రవాసులకు ఆన్లైన్లో ఓపెన్ యూనివర్సిటీ కోర్సులు
- OMCAP ఆధ్వర్యంలో జర్మనీలో ఉద్యోగాలకు 55 మంది ఏపీ నర్సుల ఎంపిక..
- మారిషస్ స్టేట్ హౌస్‌లో డా.గజల్ శ్రీనివాస్ గానం
- తెలంగాణను దేశంలో అగ్రశ్రేణి పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దుతాం: మంత్రి జూపల్లి
- ఆంధ్రప్రదేశ్ సంప్రదాయ హస్తకళలకు కొత్త ఊపిరి పోస్తున్న లేపాక్షి
- తెలంగాణ జైళ్ల శాఖకు అరుదైన గౌరవం.. 109వ స్కోచ్ అవార్డు







