ఈద్ సెలవులు 3 లేదా 4 రోజులు ఉంటాయా?
- February 19, 2026
యూఏఈ: యూఏఈలో ఈద్ అల్ ఫితర్ సెలవుల కోసం ఇప్పటినుంచే ఫ్యామిలీలు ప్లాన్ చేసుకోవడం గురించి ఆలోచన చేస్తున్నాయి. ఈ ఏడాది ఈద్ అల్ ఫితర్ సందర్భంగా మూడు రోజుల సెలవులు లభించనున్నాయి. యూఏఈ పబ్లిక్ హాలిడే క్యాలెండర్ ప్రకారం, మార్చి 20-22 తేదీల్లో ఈద్ అల్ ఫితర్ ను జరుపుకోనున్నారు.
అయితే, అధికారిక కమిటీలు మార్చి 18న వచ్చే రమదా 29వ రోజున సమావేశమై నెలవంకను చూసిన తర్వాత ఖచ్చితమైన తేదీలను ప్రకటిస్తారు.
మార్చి 18న షవ్వాల్ నెలవంక కనిపిస్తే, మరుసటి రోజు, మార్చి 19న ఈద్ అల్ ఫితర్ ప్రకటించబడుతుంది. ఇది యూఏఈ నివాసితులకు మార్చి 19 నుండి మార్చి 22 వరకు నాలుగు రోజులపాటు సెలవులు వస్తాయి. సాధారణంగా ఆదివారం ఎమిరేట్స్‌లో అధికారిక వీకెండ్ లో భాగం.
మార్చి 18న నెలవంక కనిపించకపోతే, రమదాన్ పూర్తిగా 30 రోజుల పాటు కొనసాగుతుంది. ఈద్ మార్చి 20న ప్రారంభమవుతుంది. అప్పుడు నివాసితులకు మూడు రోజుల పాటు సెలవులు మాత్రమే లభిస్తాయి.
తాజా వార్తలు
- ఎన్నిక ఏదైనా కూటమిదే ఘనవిజయం: మంత్రి కందుల దుర్గేష్
- దుబాయ్ మెరీనాలో 670 మంది కార్మికులకు భద్రత, సామాజిక అవగాహన కార్యక్రమాలు
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్‌లు విడుదల.. పరిమిత సంఖ్యలో విక్రయాలు
- గల్ఫ్ ప్రవాసులకు ఆన్లైన్లో ఓపెన్ యూనివర్సిటీ కోర్సులు
- OMCAP ఆధ్వర్యంలో జర్మనీలో ఉద్యోగాలకు 55 మంది ఏపీ నర్సుల ఎంపిక..
- మారిషస్ స్టేట్ హౌస్‌లో డా.గజల్ శ్రీనివాస్ గానం
- తెలంగాణను దేశంలో అగ్రశ్రేణి పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దుతాం: మంత్రి జూపల్లి
- ఆంధ్రప్రదేశ్ సంప్రదాయ హస్తకళలకు కొత్త ఊపిరి పోస్తున్న లేపాక్షి
- తెలంగాణ జైళ్ల శాఖకు అరుదైన గౌరవం.. 109వ స్కోచ్ అవార్డు
- యూఏఈలో ఫేక్ లాటరీ స్కామ్.. Dh84,000 కోల్పోయిన వ్యక్తి..!!







