రియో పరుగును ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. ...
- July 31, 2016
దిల్లీలోని మేజర్ ధ్యాన్‌చంద్ జాతీయ మైదానంలో రియో పరుగును ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. దాదాపు 20వేల మంది విద్యార్థులు రియో పరుగులో పాల్గొన్నారు. ధ్యాన్‌చంద్ జాతీయ మైదానం నుంచి నెహ్రూ మైదానం వరకు పరుగు కొనసాగింది. ఈ సందర్భంగా భారత అథ్లెట్లకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. 119 మంది క్రీడాకారుల బృందాన్ని రియో ఒలింపిక్స్‌కు పంపిస్తున్నామని తెలిపారు. వచ్చే ఒలింపిక్స్‌కు మరింత పెద్ద బృందాన్ని పంపుతామని వెల్లడించారు. 2020 ఒలింపిక్స్ క్రీడల్లో ప్రతి జిల్లా నుంచి ఒక అథ్లెట్ ప్రాతినిధ్యం వహించాలని సూచించారు. భారత క్రీడాకారులు ప్రపంచ ప్రజల మనస్సులు గెలుచుకుంటారని ప్రధాని ఆకాంక్షించారు. కేంద్ర క్రీడల మంత్రి విజయ్‌గోయల్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- చిరు వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వ శుభవార్త
- తెలంగాణ ప్రభుత్వం ఇన్ని ఉద్యోగాలు ఇచ్చింది: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
- తెలంగాణ: గణతంత్ర దినోత్సవం..తెలంగాణకు 23 పోలీస్ పతకాలు
- మంగళవారం బ్యాంక్ ఉద్యోగుల బంద్
- గణతంత్ర దినోత్సవం సందర్భంగా లోక్ భవన్లో జరిగిన తేనీటి విందు
- ఖతార్‌లో ఇండియా ఉత్సవ్.. గణతంత్ర దినోత్సవ వేడుకలు..!!
- భారత దేశవ్యాప్తంగా ఘనంగా గణతంత్ర వేడుకలు..
- కింగ్ ఖలీద్ ఎయిర్ పోర్టు టెర్మినల్ 2 ప్రారంభం..!!
- దుబాయ్‌లో ఘనంగా రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్..!!
- కువైట్ లో మరో బేబీ ఫార్ములా ఉపసంహరణ..!!







