ఓ ప్రైవేటు సీఎన్జీ గ్యాస్‌ బంక్‌లో గ్యాస్‌ లీకేజీ..

- July 31, 2016 , by Maagulf
ఓ ప్రైవేటు సీఎన్జీ గ్యాస్‌ బంక్‌లో గ్యాస్‌ లీకేజీ..

ఎల్బీనగర్‌లోని ఓ ప్రైవేటు సీఎన్జీ గ్యాస్‌ బంక్‌లో గ్యాస్‌ లీకేజీ కలకలం సృష్టించింది. వాహనదారులు గ్యాస్‌ ఫిల్లింగ్‌ కోసం రాగా.. అదే సమయంలో బంకు నుంచి అకస్మాత్తుగా గ్యాస్‌ లీకైంది. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే గ్యాస్‌ సరఫరా నిలిపివేశారు. ఎలాంటి ప్రమాదం జరగకుండా అగ్నిప్రమాద నిరోధక చర్యలు తీసుకున్నారు. కొన్నినిమిషాల పాటు గ్యాస్‌ లీకవడంతో వాహనదారులు ఆందోళనకు గురయ్యారు. ప్రమాదవశాత్తూ బంకులోని ఫిల్టర్‌ పేలడం వల్ల లీకేజీ ఏర్పడినట్లు సిబ్బంది తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com