గుడ్ న్యూస్.. తగ్గనున్న బ్యాంకింగ్ సర్వీస్ ఫీజులు..!!
- February 20, 2026
రియాద్ః సౌదీ సెంట్రల్ బ్యాంక్ (SAMA) గుడ్ న్యూస్ చెప్పింది. తగ్గించిన సర్వీస్ ఫీజులు ఫిబ్రవరి 20 నుండి అమల్లోకి వస్తాయని ప్రకటించింది. బ్యాంకింగ్, ఫైనాన్సింగ్ మరియు చెల్లింపు సేవల కస్టమర్ ఫీజులపై విస్తృత తగ్గింపులు మరియు పరిమితులను విధించినట్లు తెలిపింది. సవరించిన ఫీజులు బ్యాంకులు మరియు చెల్లింపు కంపెనీలతో సహా అన్ని ఆర్థిక సంస్థలకు వర్తిస్తాయని స్పష్టం చేసింది. నిబంధనలకు లోబడి సేవలకు విలువ ఆధారిత పన్ను (VAT) ఈ రుసుములలో ఉండదని క్లారిటీ ఇచ్చింది. ఇకపై అన్ని రుసుములను బహిరంగంగా ప్రదర్శించాలని సూచించింది.
అదే సమయంలో కొత్తగా కొన్ని ఫైనాన్సింగ్ ఉత్పత్తులకు ఫీజులను విధించనున్నారు. పరిపాలనా ఫీ, మడా కార్డుల పునఃజారీ ఫీ, అంతర్జాతీయ కొనుగోళ్లు మరియు నగదు ఉపసంహరణలు, బ్యాంకు అకౌంట్లు మరియు ఇ-వాలెట్ల నుండి డబ్బు బదిలీలకు ఫీ మరియు గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC) నెట్‌వర్క్‌లోని పాయింట్-ఆఫ్-సేల్ టెర్మినల్స్‌లో మడా కార్డులను ఉపయోగించడంపై కొత్తగా ఫీజులు విధించనున్నారు.
తాజా వార్తలు
- ఖతార్ లో ప్రత్యేక వాహన రిజిస్ట్రేషన్ నంబర్లకు దరఖాస్తులు ఆహ్వానం..!!
- అక్టోబర్ 1 నుంచి ఒమన్‌లో 1,546 వస్తువులపై జీరో వ్యాట్..!!
- ఒమన్ లో కన్జుమర్ కాన్ఫిడెన్స్ సర్వే నిర్వహిస్తున్న ఎన్సీఎస్ఐ..!!
- అల్ షహీద్ పార్క్ మూడో దశ ప్రారంభోత్సవం.. రెండు రోజుల కార్నివాల్..!!
- అక్టోబర్ 21న రియాద్ సీజన్ 2026 ప్రారంభం..!!
- బహ్రెయిన్ ఇండియన్ స్కూల్ లో ఆకట్టుకున్న పీస్ డే ప్రోగ్రామ్స్..!!
- 48 గంటల్లో ఐరిష్ క్రైమ్ బాస్ అరెస్ట్.. 82 ప్రాపర్టీలు సీజ్..యూఏఈ మంత్రి..!!
- అమరావతికి కీలక గుర్తింపు.. 13వ FRRO కేంద్రంగా ఏర్పాటు
- బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్..
- హార్ముజ్ జలసంధిలో అమెరికా అండర్‌వాటర్ డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్న ఇరాన్







