'విష్‌ యు హ్యాపీ బ్రేక్‌అప్‌'. ఈ చిత్రం పోస్టర్‌...

- July 31, 2016 , by Maagulf
'విష్‌ యు హ్యాపీ బ్రేక్‌అప్‌'. ఈ చిత్రం పోస్టర్‌...

తనకు కొత్త బాయ్‌ఫ్రెండ్‌ కావాలని, త్వరగా ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోండని నటి తేజస్వి అంటున్నారు. ఆమె బాయ్‌ఫ్రెండ్‌ కావాలని అడుగుతోంది నిజ జీవితంలోకి అనుకుని పొరపడకండి. తేజస్వి, ఉదయ్‌కిరణ్‌, శ్వేతవర్మ ప్రధాన పాత్రల్లో రూపుదిద్దుకుంటున్న చిత్రం 'విష్‌ యు హ్యాపీ బ్రేక్‌అప్‌'. ఈ చిత్రం పోస్టర్‌ను తేజస్వి తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. గర్ల్‌ఫ్రెండ్‌ కావాలనుకున్నవారు కామెంట్స్‌ చేయండి అని పోస్ట్‌ చేశారు.
ఈ నెల 29న 'విష్‌ యు హ్యాపీ బ్రేకప్‌' సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. కిరణ్‌రావు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తున్నారు. శేషు కేఎంఆర్‌ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com