కలెక్టర్‌ పాత్ర లో 'నయనతార..

- July 31, 2016 , by Maagulf
కలెక్టర్‌ పాత్ర లో  'నయనతార..

తన అభినయం, అందంతో దక్షిణాది చిత్ర పరిశ్రమలో స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న కథానాయకి 'నయనతార'. త్వరలో 'బాబు బంగారం' చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ భామ ప్రస్తుతం గోపీనాయర్‌ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఓ జాతీయ సమస్య ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారట. ఇప్పటికే ఈ చిత్రం 40 శాతం చిత్రీకరణ పూర్తైనట్లు తెలుస్తోంది. 'నయనతార.. సామాజిక సందేశంతో ముడిపడి ఉన్న ఈ కథవిన్న వెంటనే నటించడానికి ఒప్పుకున్నారు. ఈ చిత్రంలో ఆమె కలెక్టర్‌ పాత్రను పోషిస్తున్నారు. ఈ పాత్ర తనకు అనేక అవార్డులను తెచ్చిపెట్టే విధంగా ఉందని నయనతార తెలిపింది. ఈ చిత్రం తొలి షెడ్యూల్‌ ఆంధ్ర-తమిళనాడు సరిహద్దుకు దగ్గర్లో ఉన్న శ్రీహరికోట వద్ద జరిగింది. 'కాకముట్టై' చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న చిన్నారులు విఘ్నేశ్‌, రమేశ్‌ ఇందులో నటిస్తున్నారు' అని గోపీ తెలిపారు.కేజేఆర్‌ స్టూడియోస్‌ పతాకంపై కోటపాడి జె రాజేశ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కెమెరామన్‌: ఓం ప్రకాశ్‌, స్టంట్‌ మాస్టర్‌: పీటర్‌, ఎడిటర్‌: గోపీకృష్ణ, ఆర్ట్‌ డైరెక్టర్‌: లాల్‌గుడి ఇళయరాజా. ఓ ప్రముఖ సంగీత దర్శకుడు ఈ చిత్రానికి పనిచేయనున్నారు, త్వరలో ఆయన పేరును కూడా ప్రకటిస్తామని నిర్మాత వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com