ఇఫ్తార్‌కు ముందు అధిక వేగంపై హెచ్చరిక జారీ..!!
- February 20, 2026
దోహా: ఖతార్‌లో పవిత్ర రమదాన్ మాసం ప్రారంభమైనందున, దేశవ్యాప్తంగా వీధులు రద్దీగా మారాయి. ఈ నేపథ్యంలో ఇఫ్తార్‌కు ముందు చివరి గంటలో అధిక వేగం గురించి అంతర్గత మంత్రిత్వశాఖ హెచ్చరిక జారీ చేసింది. ఇఫ్తార్‌కు ముందు ట్రాఫిక్ ప్రమాదాలు పెరుగుతాయని పేర్కొంది. సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక ప్రకటనలో డ్రైవర్లు జాగ్రత్తగా ఉండాలని మంత్రిత్వ శాఖ కోరింది.
"మీ ప్రాణాలను లేదా ఇతరుల ప్రాణాలను ప్రమాదంలో పడేయకండి" అని మంత్రిత్వ శాఖ పేర్కొంది. “ఇఫ్తార్ కు ముందు అధిక వేగాన్ని నివారించండి. వేగాన్ని తగ్గించడం భద్రతను పెంచుతుంది మరియు ట్రాఫిక్ ప్రమాదాలను నివారించడంలో సహాయపడుతుంది. మీ భద్రత మాకు ముఖ్యం.” అని మంత్రిత్వశాఖ తెలిపింది.
తాజా వార్తలు
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్‌లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక







