AI తో ఉద్యోగాలకు ముప్పు: వెంకయ్యనాయుడు

- February 21, 2026 , by Maagulf
AI తో ఉద్యోగాలకు ముప్పు: వెంకయ్యనాయుడు

విజయవాడ: కృత్రిమ మేథస్సు (AI) విస్తృతి పెరగడం వల్ల భవిష్యత్తులో ఉపాధి అవకాశాలు సన్నగిల్లే ప్రమాదం ఉందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హెచ్చరించారు. విజయవాడలో నిర్వహించిన ఓ పూర్వ విద్యార్థుల సంఘం స్వర్ణోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

సాంకేతికత ఎంత అభివృద్ధి చెందినప్పటికీ, అది మానవ సంబంధాలను ప్రభావితం చేయకూడదని వెంకయ్యనాయుడు సూచించారు. విలువలతో కూడిన టెక్నాలజీ సమాజానికి అవసరమని, ముఖ్యంగా వైట్‌కాలర్ ఉద్యోగాల మనుగడ ప్రశ్నార్థకం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. యంత్రాల వాడకం పెరిగినా, మనిషి ఆలోచనకు ప్రాధాన్యత ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు.

కేవలం సాంకేతికతపైనే కాకుండా, మాతృభాష ప్రాముఖ్యతపై కూడా ఆయన మాట్లాడారు. తెలుగు భాషా సంస్కృతులు, సంప్రదాయాలను కాపాడుకుంటూ వాటిని తర్వాతి తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని స్పష్టం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com