AI తో ఉద్యోగాలకు ముప్పు: వెంకయ్యనాయుడు
- February 21, 2026
విజయవాడ: కృత్రిమ మేథస్సు (AI) విస్తృతి పెరగడం వల్ల భవిష్యత్తులో ఉపాధి అవకాశాలు సన్నగిల్లే ప్రమాదం ఉందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హెచ్చరించారు. విజయవాడలో నిర్వహించిన ఓ పూర్వ విద్యార్థుల సంఘం స్వర్ణోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
సాంకేతికత ఎంత అభివృద్ధి చెందినప్పటికీ, అది మానవ సంబంధాలను ప్రభావితం చేయకూడదని వెంకయ్యనాయుడు సూచించారు. విలువలతో కూడిన టెక్నాలజీ సమాజానికి అవసరమని, ముఖ్యంగా వైట్కాలర్ ఉద్యోగాల మనుగడ ప్రశ్నార్థకం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. యంత్రాల వాడకం పెరిగినా, మనిషి ఆలోచనకు ప్రాధాన్యత ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు.
కేవలం సాంకేతికతపైనే కాకుండా, మాతృభాష ప్రాముఖ్యతపై కూడా ఆయన మాట్లాడారు. తెలుగు భాషా సంస్కృతులు, సంప్రదాయాలను కాపాడుకుంటూ వాటిని తర్వాతి తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- అజ్మాన్ కొత్త మాస్టర్ ప్లాన్: ఇక ట్రాఫిక్ కష్టాలకు చెక్..
- CBSE 10వ తరగతి కొత్త నిబంధనలు: మొదటి బోర్డు పరీక్ష తప్పనిసరి..
- రమదాన్ ఇ-భిక్షాటనకు AI వినియోగం..హెచ్చరిక జారీ..!!
- యుద్ధం ముంచుకొస్తోందా? ఇరాన్ చుట్టూ పెరుగుతున్న ఉద్రిక్తతలు
- గాజాకు 100 టన్నుల అత్యవసర సహాయం ఎయిర్ లిఫ్ట్..!!
- వీకెండ్ లో పొగమంచు.. పగలు వేడి, రాత్రిళ్లు కూల్..!!
- ఒమన్ లో ఈద్ అల్ ఫితర్ సెలవులు ఎన్ని రోజులు?
- స్టాటిన్ మెడికేషన్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ వార్న్..!!
- ఖతార్ లో రికార్డు స్థాయిలో రెసిడెన్షియల్ స్టాక్స్ డెలివరీ..!!
- ‘స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర’ కార్యక్రమానికి హాజరైన సీఎం









