హై అలర్ట్‌.. దేవాలయాలే టార్గెట్‌.. దాడులకు ఉగ్రవాదుల ప్లాన్‌

- February 21, 2026 , by Maagulf
హై అలర్ట్‌.. దేవాలయాలే టార్గెట్‌.. దాడులకు ఉగ్రవాదుల ప్లాన్‌

న్యూ ఢిల్లీ: ఢిల్లీలో హై అలర్ట్‌ ప్రకటించారు. ఢిల్లీలోని ప్రార్థనా మందిరాలపై దాడులకు లష్కరే తాయిబా (ఎల్‌ఈటీ) ప్రణాళికలు వేసుకుంది. ముఖ్యంగా ఎర్రకోటకు సమీపంలోని ఓ గుడిపై దాడులు చేయాలని ఎల్‌ఈటీ భావిస్తోంది.

తాజాగా వచ్చిన ఉగ్రదాడుల అలర్ట్‌ నేపథ్యంలో ప్రస్తుతం ఢిల్లీలో హై అలర్ట్‌ ప్రకటించి, ప్రార్థనా మందిరాల వద్ద భద్రతను పెంచినట్లు వివరించారు. దాడులు జరగకుండా ఉండేందుకు ఉగ్రవాద వ్యతిరేక చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

కాగా, పాకిస్థాన్‌ రాజధాని ఇస్లామాబాద్‌లోని షియా మసీదు వద్ద ఫిబ్రవరి 6న సూసైడ్‌ బాంబుదాడి జరిగి 31 మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. గణతంత్ర దినోత్సవానికి ముందుగా కూడా ఉగ్రదాడులు జరగవచ్చన్న అలర్ట్‌ వచ్చిందని సంబంధిత అధికారులు అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com