రమదాన్ ఇ-భిక్షాటనకు AI వినియోగం..హెచ్చరిక జారీ..!!

- February 21, 2026 , by Maagulf
రమదాన్ ఇ-భిక్షాటనకు AI వినియోగం..హెచ్చరిక జారీ..!!

యూఏఈ: పవిత్ర మాసంలో ఇ-భిక్షాటనకు ఏఐ వినియోగిస్తున్నట్లు యూఏఈ అధికారులు హెచ్చరించారు. వైద్య అత్యవసర పరిస్థితులు, ఆన్‌లైన్ ఛారిటీ అప్పీళ్లను మార్చటానికి ఏఐని ఉపయోగిస్తున్నారని అధికారులు తెలిపారు. ఇలాంటి ప్రకటనలు ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసేలా రూపొందిస్తున్నారని , వీటి పట్ల జాగ్రత్తగా ఉండాలని, అలాంటి ప్రకటనలను షేర్ చేయకుండా సంబంధిత అధికారులకు నివేదించాలని కోరారు.  

వాట్సాప్ గ్రూపులలో, ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలాంటి పోస్ట్ లు వైరల్ చేస్తున్నారని తెలిపారు.  ఈ భావోద్వేగ పోస్ట్‌లలో కొన్నింటి వెనుక నిమిషాల్లో ఏఐతో వైద్య అత్యవసర పరిస్థితులను కల్పించగలరని, వాస్తవికంగా ఉండేలా ఆసుపత్రి పరిసరాలను సృష్టిస్తున్నారని,  ఫేక్ మెడికల్ బిల్స్, పేపర్లు రూపొందించి సానుభూతిని తద్వారా డబ్బులను పొందేలా కథనాలను AI మోసగాళ్ళు స్క్రిప్ట్ చేస్తున్నారని బ్రిగేడియర్ అలీ సలేం వివరించారు.    

తమ ప్రత్యేక సైబర్ క్రైమ్ యూనిట్లు ఎలక్ట్రానిక్ బెగ్గింగ్ మరియు AI- ఆధారిత మోసాన్ని గుర్తిస్తున్నాయని, డిజిటల్ ఫోరెన్సిక్ సాధనాల ద్వారా తయారు చేసిన వారిని ట్రేస్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.   యూఏఈలో ఎలక్ట్రానిక్ భిక్షాటనకు మూడు నెలల వరకు జైలు శిక్ష మరియు Dh10,000 కంటే తక్కువ కాకుండా జరిమానా విధించబడుతుందని హెచ్చరించారు.  అలాంటి వీడియోలు, ఇ-బెగ్గింగ్ సంబంధిత విషయాలను పోలీసులకు 901 లేదా అత్యవసర పరిస్థితి నెంబర్ 999 లేదా eCrime ప్లాట్‌ఫామ్: www.ecrime.ae  ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com