పెళ్ళి చూపులు 10 కోట్ల వరకు వసూలు చేయవచ్చని అంచనా...
- July 31, 2016
'పెళ్లిచూపులు' ఇప్పుడు టాలీవుడ్లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిన చిన్న సినిమా. ఈ సినిమా రిలీజ్‌కి ముందే సురేష్ బాబు, మధుర శ్రీధర్ లాంటి వారు సోషల్ మీడియాలో సూపర్‌గా వుందంటూ చెబితే.. అదంతా పబ్లిసిటీ స్టాటజీ అనుకొన్నారు. కానీ సినిమా రిలీజ్ అయ్యాకా అది నిజం అయ్యింది. ఈ సినిమా మార్నింగ్ షోకి కలెక్షన్లు అంతగా లేవు. అదే రోజు రిలీజ్ అయిన సునీల్ 'జక్కన్న'కి కలెక్షన్లు అదిరిపోయాయి. కానీ.. సాయంత్రానికి సీన్ మారిపోయింది. స్ట్రాంగ్ మౌత్ టాక్‌తో 'పెళ్ళిచూపులు' కలెక్షన్లు అనూహ్యంగా పెరిగాయి. రెండో రోజు ఈ సినిమా కలెక్షన్లు మరింత పెరిగాయి.ఇక్కడే కాదు యుఎస్‌లో కూడా ఈ సినిమా రెండు రోజులకు 74,862 డాలర్లు కలెక్ట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక 'జక్కన్న' సినిమాకు నెగెటివ్ టాక్ రావడంతో ఈ సినిమాకి అడ్డులేకుండా పోయింది. దాంతో ఈ సినిమాకి థియేటర్లు పెంచుతున్నారట. 2 కోట్లలోపు బడ్జెట్లో తెరకెక్కిన ఈ సినిమా 10 కోట్ల వరకు వసూలు చేయవచ్చని అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







