ప్రపంచ దేశాలకు ట్రంప్ వార్నింగ్
- February 24, 2026
అమెరికా: అమెరికా సుప్రీంకోర్టు వెలువరించిన ఒక కీలక తీర్పు ఇప్పుడు అంతర్జాతీయ వాణిజ్య వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ తీర్పును సాకుగా చూపుతూ కొన్ని దేశాలు అమెరికాతో ఉన్న సంబంధాలను, ఒప్పందాలను పునఃసమీక్షించుకోవాలని చూస్తున్నాయి. ఈ క్రమంలోనే అమెరికా ప్రయోజనాలకు విరుద్ధంగా ఏ దేశమైనా “గేమ్స్” ఆడితే ఊరుకునేది లేదని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. సుప్రీంకోర్టు తీర్పును అడ్డంపెట్టుకుని అమెరికాను బ్లాక్మెయిల్ చేయాలని చూడవద్దని ఆయన సూచించారు.ముఖ్యంగా అమెరికా ను దశాబ్దాలుగా టారిఫ్స్‌తో పీడించిన దేశాలకు గతంలో కంటే ఎక్కువ టారిఫ్స్ విధిస్తానని వార్నింగ్ ఇచ్చారు.
సుప్రీంకోర్టు ఈ తీర్పు ద్వారా తెలియకుండానే తనకు మరిన్ని అధికారాలు కట్టబెట్టిందని వ్యాఖ్యానించారు. కొన్ని దేశాలు అమెరికాను దశాబ్దాలుగా కొల్లగొట్టాయని ఆరోపించారు. సుప్రీంకోర్టు తీర్పును ఆధారంగా చేసుకుని, ఇష్టానుసారం వ్యవహరించాలని చూస్తే ఇటీవల అంగీకరించిన సుంకాల కంటే భారీగా ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన తన ట్రూత్ సోషల్ మీడియాలో ఈ హెచ్చరిక జారీ చేశారు.అంతర్జాతీయ అత్యయిక ఆర్థిక అధికారాల చట్టంను ఉపయోగించి డొనాల్డ్ ట్రంప్ తన మాట వినని వివిధ దేశాలపై అధిక పన్ను విధించారు. ట్రంప్ అధిక సుంకాలకు అమెరికా కాంగ్రెస్ ఆమోదం లేదు. టారిఫ్ అంశం సుప్రీంకోర్టుకు వెళ్లగా, ట్రంప్ తీరును తప్పుబట్టింది. ఆయన నిర్ణయానికి వ్యతిరేకంగా తీర్పు వెలువరించింది.
తాజా వార్తలు
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్‌కు తొలి స్థానం..!!
- ఖతార్‌లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్‌లో భారీ వర్షాలు..!!
- ఇరాన్‌పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!
- సౌదీ మరో ఘనత..అంతర్జాతీయ ఐఎస్ఓ కమిటీకి నేతృత్వం..!!
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్‌కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి







