ఇజ్కిలో ట్రక్కు బోల్తా..అగ్నికి ఆహుతి..!!

- February 24, 2026 , by Maagulf
ఇజ్కిలో ట్రక్కు బోల్తా..అగ్నికి ఆహుతి..!!

మస్కట్ః  అల్ దఖిలియా గవర్నరేట్‌లోని ఇజ్కిలోని విలాయత్‌లో ట్రక్కు బోల్తా పడిన దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రమాదంపై సమాచారం అందగానే రెస్క్యూ టీమ్స్ తరలివెళ్లాయని, మంటలను అదుపు చేశారని సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ అథారిటీ తెలిపింది. ట్రక్కు బోల్తా పడటంతో ప్రమాదం సంభవించిందని అధికారులు తెలిపారు. అత్యవసర సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను విజయవంతంగా అదుపులోకి తెచ్చారని వెల్లడించింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి గాయపడ్డాడని, తదుపరి చికిత్స కోసం ఆసుపత్రికి తరలించినట్టు తెలిపింది. ప్రమాదానికి గల కారణాన్ని తెలుసుకునేందుకు అధికారులు దర్యాప్తు జరుపుతున్నారని అథారిటీ వెల్లడించింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com