శ్రీవారి సేవలో ‘డెకాయిట్’ టీమ్

- February 28, 2026 , by Maagulf
శ్రీవారి సేవలో ‘డెకాయిట్’ టీమ్

కలియుగ దైవం తిరుమల వేంకటేశ్వర స్వామివారిని ‘డెకాయిట్’ చిత్ర బృందం శనివారం ఉదయం దర్శించుకుంది. ఈ చిత్రంలో జంటగా నటించిన హీరో అడివి శేష్, హీరోయిన్ మృణాల్ ఠాకూర్ వీఐపీ విరామ దర్శనంలో పాల్గొని స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు వారికి ఘనస్వాగతం పలికి, దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదాశీర్వచనం అందించి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

త్వరలో విడుదల కానున్న తమ చిత్రం ‘డెకాయిట్’ ఘనవిజయం సాధించాలని కోరుకుంటూ వీరు స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. అడివి శేష్, మృణాల్‌లను చూసేందుకు అభిమానులు ఎగబడటంతో కొద్దిసేపు అక్కడ కోలాహలం నెలకొంది. ఈ చిత్రం ఏప్రిల్ 10న విడుదల కాబోతున్న నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్లలో వేగం పెంచింది. గురువారం వరంగల్ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న శేష్, నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం విశేషం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com